గెలుపు పై టీడీపీ అంతర్గత సర్వే ? ఎన్ని సీట్లలో విజయమంటే ? 

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమ ఖాతాలో వేసుకోవాలని ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.నిత్యం ప్రజా ఉద్యమాలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ,  ఏపీ ప్రభుత్వం పై పై చేయి సాధించేందుకు , 2024 ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది.

 Tdp Internal Survey Of Winning Chances In Ap 2024 Elections Details, Ysrcp, Ap,-TeluguStop.com

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే ఒక అంచనాకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.గతంతో పోలిస్తే ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజాగ్రహం పెరిగిందని,  ఆ పార్టీ బలంగా నమ్ముతోంది 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టిడిపికి గెలుపు అవకాశాలు ఉన్నాయని లెక్కలు వేసుకుంటుంది.2023లో కేవలం టిడిపి 23 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం , మిగతా నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందడం తో రాబోయే ఎన్నికల్లో టిడిపికి విజయం ఖాయమని బలంగా నమ్ముతుంది.

ఈ మేరకు పార్టీ అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించినట్లు సమాచారం.

ఈ సర్వేలో ప్రస్తుతం గెలుచుకున్న 23 స్థానాలతో పాటు 79 నియోజకవర్గాల్లో టిడిపికి గెలుపు గ్యారెంటీ అన్న రిపోర్ట్ అందిందట.దీంతో మొత్తం 102 నియోజకవర్గాల్లో టిడిపికి విజయ అవకాశాలు ఉన్నట్లుగా తేలడంతో టిడిపి గెలుపుపై నమ్మకం ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం పెద్దల్లో కనిపిస్తోంది 2019 లో ఓటమి చెందినా, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం పై వ్యతిరేకత కారణంగా తమ ఓటు బ్యాంకు పెరుగుతుందని టిడిపి ఆశలు పెట్టుకుంది.

అందుకే ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే విధంగా ఈ మధ్యకాలంలో పార్టీ కార్యక్రమాల జోరును పెంచారు.

ఇక పొత్తుల అంశం పైన ఇప్పుడు చర్చించడం వల్ల ఉపయోగం ఉండదని , ఎన్నికల సమయంలో పొత్తుల అంశంపై దృష్టి పెడితే సరిపోతుందని,

Telugu Ap Cm, Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Tdp, Tdp Survy, Ysrcp-Politic

అప్పటి లోగా  సొంతంగానే బలం పెంచుకునే ముందుకు వెళితే మంచిదనే అభిప్రాయంలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.దీనికి తగ్గట్లుగానే పార్టీ నేతలు నుంచి ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని ఒత్తిడి పెరుగుతుండడంతో చంద్రబాబు సైతం ఇప్పట్లో పొత్తు వ్యవహారంపై మాట్లాడకపోవడం మంచిదమే అభిప్రాయంతో ఉన్నారట.ఇప్పటికే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం తో పాటు,  నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న వారు నిత్యం ప్రజల్లోకి వెళ్తూ,  టిడిపిని జనాలకు మరింత చేరువు చేసే విషయంపై దృష్టి పెట్టాలని ,  ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని సర్వే ఫలితాలు వెలువడ్డాయని,  కార్యకర్తలు, నాయకులు అంతా ఉత్సాహంగా పనిచేస్తూ వైసిపి ప్రభుత్వం తీరును ఎండగట్టాలని తగిన సూచనలతో కొంది స్థాయి నాయకులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube