ఆ ఇద్దరినీ గెటప్ శ్రీను బకరా చేశారా. . సుధీర్ అలా మోసపోయాడంటూ?

ఎక్స్ట్రా జబర్దస్త్ షో నుంచి కొన్ని వారాల క్రితం గెటప్ శ్రీను వెళ్లిపోయారనే సంగతి తెలిసిందే.సినిమాలలో వరుసగా ఆఫర్లు రావడం వల్లే గెటప్ శ్రీను ఈ షోకు గుడ్ బై చెప్పారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

 Sudheer And Edukondalu Becomes Bakara Details Here Goes Viral , Getup Srinu , S-TeluguStop.com

జబర్దస్త్ లో కొన్నేళ్ల క్రితం వరకు పని చేసిన ఏడుకొండలు మాత్రం గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడని కామెంట్లు చేశారు.మరోవైపు గెటప్ శ్రీను జబర్దస్త్ కు దూరం కావడం వల్లే సుధీర్ ఈ షోకు గుడ్ బై చెప్పారని ప్రచారం జరిగింది.

అయితే అటు ఏడుకొండలును ఇటు సుధీర్ ను గెటప్ శ్రీను బకరా చేశాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.గెటప్ శ్రీను రీఎంట్రీ ఇవ్వగా సుడిగాలి సుధీర్ కూడా ఈ షోలోకి రీఎంట్రీ ఇస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే సుధీర్ మాత్రం స్టార్ మా ఛానెల్ కు మాత్రమే పరిమితమవుతారని సమాచారం అందుతోంది.తాజాగా రామ్ ప్రసాద్ సైతం సుధీర్, శ్రీను, నేను కలిసి స్కిట్ చేయడం సులువు కాదని చెప్పుకొచ్చారు.

సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కలిసి షోలు చేయకపోయినా వాళ్ల మధ్య స్నేహం మాత్రం అదే విధంగా ఉందని తెలుస్తోంది.సుడిగాలి సుధీర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ షోలు కూడా చేస్తున్నారు.

సుడిగాలి సుధీర్ కు రోజురోజుకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది.బుల్లితెర యాంకర్లలో చాలామంది సినిమాలలో సక్సెస్ సాధించలేకపోయారు.

సుధీర్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఆయన ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

Telugu Edukondalu, Extrajabardasth, Getup Srinu, Jabardast, Ram Prasad, Sudheer-

ప్రస్తుతం బుల్లితెరపై హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న యాంకర్లలో సుధీర్ ఒకరు కావడం గమనార్హం.సుధీర్ మల్టీ టాలెంటెడ్ కావడంతో ఇతర ఛానెళ్ల నుంచి కూడా సుధీర్ కు ఆఫర్లు వస్తున్నాయి.సుధీర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా కెరీర్ విషయంలో సుధీర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube