ఇందిరా గాంధీ కోపం తో స్నేహితురాలికి ఎందుకు నరకం చూపింది?

ఒక వ్యక్తి పైన కోపం ఉంటే అది ఎంతటి దారుణమైన ప్రభావాన్ని చూపిస్తుందో మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.ఇందిరా గాంధీ, గాయత్రీ దేవి మన దేశంలోనే అతి ముఖ్యమైన వాళ్లలో ఒకరు.

 Interesting Story Behind Indira Gandhi Vs Gayathri Devi Details, Indira Gandhi,-TeluguStop.com

ఇందిరా గాంధీ మనందరికీ తెలిసిందే ప్రధానమంత్రి కూతురు, స్వయానా ప్రధానమంత్రి.మరి గాయత్రీ దేవి ఆమె ఒక రాజ కుటుంబంలో పుట్టింది ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళల్లో టాప్ టెన్ లో గాయత్రి దేవి ఖచ్చితంగా ఉంటుంది.

స్వతహాగా రాజరికంలో పుట్టింది కాబట్టి ఆభరణాలు, అందం, రాజసం ఆమె సొంతం.ఇద్దరూ మహిళల మధ్య బయట ప్రపంచానికి తెలియని పెద్ద సంఘర్షనే ఉంది ఇందిరాగాంధీ చేతిలో పదవి ఉంటే గాయత్రీ దేవి చేతిలో రాజరికం ఉంది.

అడ్డుపెట్టుకొని ఇందిరాగాంధీ గాయత్రి దేవికి నరకం చూపించింది అనేదే ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా వినిపిస్తున్న మాట.వీరిద్దరికీ మధ్య గొడవ ఎందుకు జరిగింది? ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ లో ఇందిరా గాయత్రి ఇద్దరు కలిసి చదువుకున్నారు ఆ తర్వాత లండన్ లోను వీరిద్దరూ క్లాస్ మెట్స్ గా ఒకే యూనివర్సిటీలో ఉన్నారు.గాయత్రీ దేవి ఒక సంపన్నురాలు.

దాంతో ఆమె చాలా లగ్జరీగా బ్రతికేది మధ్యాహ్నం పూట ఆమె కోసం పది మంది పనివారు వచ్చి భోజనం పెట్టేవారట.అంతటి ఉన్నత స్థానంలో జీవించింది వాడిన కారు వాడేది కాదు వేసిన బట్టలు వేసేది కాదు ఎప్పుడు ఒంటినిండా రకరకాల వివిధ అలంకరణలు, చేతిలో సిగరెట్ ఇలా ఆమె ఒక అత్యంత లగ్జరీ లైఫ్ని జీవించింది.

దాంతో గాయత్రీ దేవి పై ఇందిరా గాంధీకి అసూయ నిండిపోయింది ఆ అసూయతోనే రానున్న కాలంలో భారత దేశంలో కొన్ని చట్టాలు కూడా వచ్చాయి అంటే నమ్మశక్యం కాని విషయమే.

Telugu Congress, Emergency, Gayathri Devi, India Emergency, Indira Gandhi, Indir

అది ఎంతలా అంటే గాయత్రీ దేవిని జైలుకు పంపే అంతవరకు ఇందిరా నిద్రపోలేదు.గాయత్రీ దేవి మాన్ సింగ్ అనే ఒక రాజుకి మూడవ భార్యగా వెళ్ళింది.వందల కోట్ల ఆస్తి ఉన్న పరదా చాటున ఆమె జీవించలేదు.

సవతి పిల్లల్ని కూడా సొంత పిల్లల్లా చూసుకుంది స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ విద్యాబుద్ధులు నేర్పించింది.కాంగ్రెస్ పార్టీపై వారు చేస్తున్న అక్రమాలపై గాయత్రీ దేవి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేది ప్రజలకు చదువు లేదు కాబట్టి దేశాన్ని దోచుకుంటున్నారు అంటూ బాహాటంగా చెప్పేది.

దాంతో గాయత్రి పై ఇందిరా మరింత ద్వేషాన్ని పెంచుకుంది.ఇక రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిన ఆమె ఇందిరతో ఉన్న గొడవల రాలేకపోయింది.స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రపంచ రికార్డు మెజారిటీతో గెలిచి లోక్ సభలో అడుగు పెట్టింది.

Telugu Congress, Emergency, Gayathri Devi, India Emergency, Indira Gandhi, Indir

లోక్ సభలో కూడా గాయత్రికి ఇందిరకి ఒక్కక్షణం పడేది కాదు.బిచ్ అంటూ గాయత్రీ ని అనడం అప్పటి జర్నలిస్టులందరికీ తెలిసిందే.ఇక ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా తన ప్రతాపాన్ని చాలామంది జర్నలిస్టులపై, అలాగే తన రాజకీయ ప్రత్యర్థులపై చూపించింది.

లెక్కకు మించిన బంగారం, డబ్బు ఉందంటూ గాయత్రీ దేవిపై కేసులు పెట్టి జైలుకు పంపించింది.ఎలుకలు చచ్చిన ఆ జైలు గదిలో ఆరు నెలల పాటు గాయత్రీ దేవి ఎన్నో బాధలకు ఓర్చుకుంది.

అనారోగ్యం పాలై ఏకంగా ఆరు నెలల్లో 20 కేజీలకు పైగా బరువు తగ్గింది.ఎంతో అప్పుడు తన కోపాన్ని తగ్గించుకుని ఇందిరా షరతులతో కూడిన బెయిలు ఇప్పించింది.

అలా ఆ క్షణమే రాజకీయాలకు స్వస్తి పలికింది గాయత్రి 2009 వరకు జీవించి అనారోగ్యంతో కన్ను మూసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube