మీరు లేకుండా నేను లేను నాన్నా.. మహేష్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ బాబు గుర్తింపును సంపాదించుకున్నారు.

 Mahesh Babu Emotional Post Goes Viral In Social Media Details Here Mahesh Babu ,-TeluguStop.com

భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మహేష్ బాబు పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుకానుంది.

అయితే ఫాదర్స్ డే సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసిన మహేష్ బాబు తన తండ్రి నాన్న అనే పదానికి సరైన నిర్వచనాన్ని నాకు తెలియజేశారని తెలిపారు.

నాన్న లేకుండా తాను లేనని హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అంటూ మహేష్ బాబు ట్వీట్ లో చెప్పుకొచ్చారు.మహేష్ బాబు చేసిన ట్వీట్ కు 25,000కు పైగా లైక్స్ వచ్చాయి.

తండ్రిపై తనకు ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతను వెల్లడిస్తూ మహేష్ బాబు పోస్ట్ పెట్టడం గమనార్హం.కెరీర్ తొలినాళ్లలో మహేష్ బాబు సక్సెస్ కోసం కృషి చేసిన కృష్ణ ప్రస్తుతం మహేష్ సినిమా కథల విషయంలో జోక్యం చేసుకోవడం లేదు.మహేష్ బాబు మూవీ థియేటర్లలో రిలీజైతే మాత్రం సినిమాల గురించి కృష్ణ తన మనస్సులో ఉన్న అభిప్రాయాలను పంచుకుంటున్నారు.మరోవైపు మహేష్ గొప్ప తండ్రిగా కూడా వార్తల్లో నిలుస్తున్నారు.

మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితార చాలా సందర్భాల్లో తమ తండ్రి గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.మెగాస్టార్ చిరంజీవి, బండ్ల గణేష్ మరి కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఫాదర్స్ డే గ్రీటింగ్స్ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube