పెళ్లిలో నయనతార ధరించిన కాస్ట్యూమ్‌, నగల ఖరీదు ఎంతో తెలుసా?

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార పెళ్లి అయ్యింది.ఏడు సంవత్సరాలుగా సస్పెన్స్ గా.

 Lady Super Star Nayanatara And Vignesh Shivan Marriage News , Film News , Lady-TeluguStop.com

ఒక బ్రహ్మ పదార్థం మాదిరిగా ఉండి పోయిన నయనతార పెళ్లి ఎట్టకేలకు పూర్తి అయ్యింది.నేడు ఉదయం లాంచనంగా మహాబలిపురంలో జరిగింది.

పెళ్లిలో బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్ ఖాన్‌ తో పాటు రజినీకాంత్‌.సూర్య.

ఇంకా పలువురు ప్రముఖ దర్శకులు పాల్గొన్నారు.ఈ పెళ్లి లో నయనతార ఎలా కనిపించింది.

ఫోటోలు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. విఘ్నేష్‌ శివన్‌ స్వయంగా తన పెళ్లి ఫోటో లను షేర్‌ చేశాడు.

సూపర్‌ స్టార్‌ నయన తార అద్బుతమైన కాస్ట్యూమ్‌ లో కళ్లు మెరిసి పోయేంతటి నగలతో మెరిసి పోయింది.ఈ పెళ్లి కోసం నయనతార ప్రత్యేకమైన చీర ను తయారు చేయించింది.నయనతార కాస్ట్యూమ్స్ కోసం దాదాపుగా 12.5 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ మొత్తం తక్కువే అయినా కూడా అద్బుతంగా లుక్‌ వచ్చింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు, చీర అయినా కూడా చీరలా కాకుండా విభిన్నమైన లుక్ లో అందరు మాట్లాడుకునేలా ఆకట్టుకునేలా అలరించింది.ముద్దుగుమ్మ నయనతార యొక్క హడావుడి అంతా ఇంతా కాదు.

ఇక ఆమె వేసుకున్న నగల ఖరీదు తెలిస్తే అవాక్కవాల్సిందే.దాదాపుగా రెండు కోట్ల ఖరీదు ఉంటాయని అంటున్నారు.వజ్రాలు పొదిగిన స్టెప్‌ హారం ను ఆమె ధరించింది.ఆ హారం ను అత్యంత ఖరీదైన వజ్రాలతో తయారు చేయడం జరిగిందట.ప్రముఖ బంగారు ఆభరణాల డిజైనర్ దాన్ని డిజైన్ చేశారని తెలుస్తోంది.మొత్తానికి ఆమె ధరించిన చీర మరియు బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా ఆమె సహజంగానే చాలా అందంగా ఉంటుంది.

అలాంటి నయనతార ఇలా కనిపించడంతో అభిమానులకు రెండు కళ్లు కూడా చాలడం లేదు.అందమైన అమ్మాయి కాస్త ఇంత అందంగా మారింది.

ఈమెను చేసుకున్నందుకు విగ్నేష్‌ శివన్‌ అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube