బుల్లితెర లేటెస్ట్ సెన్సేషన్ ప్రస్తుతం ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సుడిగాలి సుధీర్ అని చెప్పాలి.ఈయన తనదైన కామెడీ మరియు అమాయకపు నటన వలన సుడిగాలి సుదీర్ అంటే తెలియని తెలుగు వారు ఉండరు.
అతడిని ఇష్టపడని వారు కూడా వుండరు.అంతగా తన పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు సుదీర్.
తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సుధీర్ తన తండ్రికి సంబందించిన ఒక విషయాన్ని షేర్ చేసుకుని కంటతడి పెట్టుకున్నారు.అప్పట్లో తన తండ్రికి అలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంతకీ అసలేం జరిగింది అంటే ఇప్పుడంటే క్రేజ్ తో వరుస అవకాశాలతో రెండు చేతులా సంపాదిస్తూ సంతోషంగా సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నా కానీ అప్పట్లో మా ఫ్యామిలీ పడిన కష్టాలు చాలానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంటర్ కూడా పూర్తి చేయని సమయంలో నాన్నకు యాక్సిడెంట్ జరగడంతో కాలికి ఐరన్ రాడ్ పెట్టారు.
ఆయన అసలే షుగర్ పేషంట్ కావడంతో ఎక్కువ రెస్ట్ అవసరమైంది.దాంతో మధ్యలోనే నా చదువు వదిలేసి ఇంటి బాధ్యతలను మీద వేసుకుని పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చాను.ఎనిమిది వేల జీతంతో రామోజీ ఫిలిం సిటీలో ఒక జాబ్ లో చేరి నెల నెలా రూ.500 మాత్రమే నేను ఉంచుకుని మిగిలినదంతా ఇంటికి పంపేవాడిని, వీక్ ఆఫ్ ఉండదు అయినా అన్నిటినీ భరిస్తూ చేసుకు వచ్చాను.రెండేళ్లకు జీతాన్ని 30,000 వేలకు పెంచారు.కొన్నాళ్ళు చేశాక కొన్ని కారణాల వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది.దాంతో మళ్ళీ కష్టాలు ఎక్కువయ్యాయి.
అప్పట్లో మూడు పూటలా భోజనం చేసిన రోజులను లెక్క పెట్టుకోవచ్చు, తిండి లేక నీళ్లు తాగి కడుపు నింపుకునే రోజులు కూడా ఎన్నో అంటూ తన పడ్డ బాధలను తెలిపారు.
తరవాత జబర్దస్త్ లో అవకాశం వచ్చింది.ఇక అప్పటి నుండి నా జీవితమే మారిపోయింది, ప్రేక్షకుల ఆదరణ నన్ను ఇంతవాడిని చేసింది, వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను.ఒకప్పుడు నన్ను కనీసం గుర్తించని వారు కూడా ఇపుడు పిలిచి మరీ అవకాశాలు ఇస్తూ ఉంటే మనసులో చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటూ తెలిపారు సుధీర్. ఏదేమైనా ఒక్కసారిగా జీవితంలో సుఖాలు వచ్చేయవు మన కృషి, పట్టుదలే మనల్ని నెమ్మదిగా విజయానికి చేరుస్తుంది అని అన్నారు.
జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన కమిడియన్ కమ్ నటుడు సుడిగాలి సుదీర్. అంతకు ముందు నుండే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తగిన అవకాశాలు రాక గుర్తింపు దక్కలేదు, కానీ జబర్దస్త్ కు వచ్చాక అతడి ఫేట్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.టాలెంట్ ఉండే వారికి ఒక్క అవకాశం పడితే చాలు ఎక్కడికో వెళ్ళిపోతారు అనడానికి సుధీర్ ఒక నిదర్శనం అని చెప్పొచ్చు .ఇక యాంకర్ రేష్మికి ఇతడికి మద్య స్క్రీన్ పై జరిగే లవ్ ట్రాక్ వలన కూడా ఇతడు బాగా ఫేమస్ అయ్యారు.ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి ఎన్నో కష్టాలను దాటుకుని నేడు ఈ స్థాయిలో ఉన్న సుధీర్ ఒక స్టేటస్ వచ్చినప్పటికీ అంతే వినయంగా ఉండటం గొప్ప విషయం.