సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం కరాలపాడు గ్రామంలో కాలనీ నందు నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణ పనులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రామాలయ నిర్మాణానికి యాభై వేల రూపాయల విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్బంగా గ్రామస్తులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికి రామాలయ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాయపూరి మల్లయ్య గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు అవులురి వెంకట రెడ్డి గారు, గ్రామ పార్టీ సెక్రటరీ కొలికపోగు పుల్లారావు గారు, గోవింద్ గారు, పెనుబల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు గారు, జడ్పిటిసి చెక్కిలాల మోహన్ గారు, ఎంపీపీ లక్కీనేని అలేఖ్య వినీల్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ చెక్కీలాల లక్ష్మణరావు గారు, సి.డి.సి చైర్మన్ భూపాల్ రెడ్డి గారు, మండల ఎం పి టి సి సంఘం అధ్యక్షులు కనగాల సురేష్ గారు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మంగళ పు అశోక్ గారు,జోనల్ కన్వీనర్లు గువ్వల వెంకట రెడ్డి గారు, లగడపాటి శీను గారు, తదితరులు పాల్గొన్నారు.