మంత్రి మల్లారెడ్డి వివాహ వార్షికోత్సవ వేడుకలు

మంత్రి మల్లారెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బోయిన్ పల్లిలోని మంత్రి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు మంత్రి నివాసం వద్దకు చేరుకొని శుభాకాంక్షలు తెలపడానికి, మంత్రి దృష్టిలో పడడానికి పోటీ పడ్డారు.

 Minister Mallareddy Wedding Anniversary Celebrations, Mallareddy , Wedding Ann-TeluguStop.com

మంత్రి మల్లారెడ్డి దంపతులు కుటుంబసభ్యులతో కలసి ఉదయం తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఇంటికి చేరుకున్న మంత్రి దంపతులు టీఆరెస్ యువనేత టింకు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు.మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా టింకు గౌడ్ మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు మంత్రి మల్లారెడ్డి ఎల్లప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం పాటు పడతారని తెలిపారుశ్రీమతి మల్లారెడ్డి గారు కూడా ఎల్లప్పుడు మంత్రిగారి అడుగుజాడలలో నడుస్తు టీఆరెస్ నేతలు కార్యకర్తలను కుటుంబ సభ్యుల వలనే ఆప్యాయంగా పలుకరిస్తారని పేర్కొన్నారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో మంత్రి మల్లారెడ్డి దంపతులు ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube