నవగ్రహాలకు గర్భాలయాలు ఎందుకు ఉండవో తెలుసా?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు ముక్కోటి దేవతలు ఉన్నాయి.అయితే మన దేశం అంతటా ఒక్కో దేవుడిని ఒక్కోలా కొలుస్తుంటారు.

అందుకోసం ప్రత్యేక ఆలయాలు నిర్మిస్తారు.ముఖ్యంగా విగ్రహ ఉత్సవ మూర్తిని గర్భాలయంలోనే ఉంటాయి.

అంతే కాకుండా శివాలయం, ఆంజనేయ స్వామి గుడుల్లో ఎక్కువగా మనకు నవ గ్రహాలు కన్పిస్తుంటాయి.కానీ నవగ్రహాలు ఆలయం ఆవరణలోనే ఓ పక్కన నిర్మించబడి ఉంటాయి.

అయితే వీటికి ఒఖ గుడి ఉన్నప్పటికీ.గర్భాలయం మాత్రం ఉండదు.

Advertisement

ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.నవ గ్రహాలకు విడివిడిగా ఆలయాలు కట్టేటట్లయితే గర్భగుడి కట్టవచ్చు.

తమిళనాడులోని సూర్యనార్ కోయర్ దగ్గర నవ గ్రహాలకు విడిగా గర్భాలయాలతో ఆలయాలు ఉన్నాయి.నవ గ్రహాలు ఒక పీఠం మీద నిర్మాణం చేసినప్పుడు ఈ విగ్రహాలు అష్టదిక్కులకు అభిముఖంగా ఉంటాయి.

అలా ఉన్నప్పుడు గర్భాలయం నిర్మాణం చేయరాదు.కారణం గర్భాలయంలో ఉన్న ఏ విగ్రహాన్ని అయినా సరే భక్తులు ఎదురుగా ఉండి చూసేందుకు వీలుగా విగ్రహాలు ఏర్పాటు అవుతాయి.

మరి నవ గ్రహాల్లో సూర్యశక్తులు మాత్రమే భక్తుడికి అభిముఖంగా ఉండి మిగిలినవి వేర్వేరు దిక్కుల్లో ఉంటాయి.కావున వాటిని దర్శించుటకు భక్తుడు విగ్రహం దగ్గరకు వెళ్లాలి లేనిది ఆ పీఠం మీద మిగిలిన విగ్రహాలు దర్శనీయం కావు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
These Face Packs Help To Get Smooth Skin Details Face Packs

అందువలన భక్తులందరూ లోపలకు వెళ్లాలంటే గర్భాలయం మీదుగా నిర్మాణం చేస్తే.ఆగమ ధర్మాలకు విరోధం అవుతుంది.

Advertisement

కావున ఒక పీఠం మీద తొమ్మిది విగ్రహాలు (నవ గ్రహాలు) ఉంచినప్పుడు గర్భాలయాలు పనికి రావు.అందుకే నవ గ్రహాలకు గర్భాలయం నిర్మించరు.

" autoplay>

తాజా వార్తలు