ఏ నష్టం వచ్చినా నేను సొంతంగా భరిస్తాను.. భీమ్లా విషయంలో పవన్ అలా చెప్పారా?

2014 సంవత్సరంలో ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంతో వైసీపీ అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే.175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో వైసీపీ కేవలం 67 స్థానాలకే ఆ సమయంలో పరిమితమైంది.అయితే 2019 సంవత్సరంలో మాత్రం వేర్వేరు కారణాల వల్ల టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయలేదు.ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే మాత్రం 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించేది మాత్రం కాదు.

 Star Hero Pawan Kalyan Guarantee To Distributors Details Here , Bheemla Nayak ,-TeluguStop.com
Telugu Bheemla Nayak, Distributors, Guarantee, Jagan Sarkar, Janasena, Pawan Kal

అయితే 2019లో వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించిందని ఆరోపణలు వినిపించాయి.వకీల్ సాబ్ సినిమా విడుదలకు ఒకరోజు ముందు ప్రభుత్వం జీవోను అమలులోకి తీసుకొని రావడానికి కూడా అసలు కారణం ఇదేనని కామెంట్లు వ్యక్తమయ్యాయి.వకీల్ సాబ్ విడుదల ముందు అమలులోకి వచ్చిన జీవోను ఉపసంహరించు కుని భీమ్లా నాయక్ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఏపీ ప్రభుత్వం కొత్త టికెట్ల జీవోను అమలులోకి తెచ్చింది.

Telugu Bheemla Nayak, Distributors, Guarantee, Jagan Sarkar, Janasena, Pawan Kal

అయితే భీమ్లా నాయక్ రిలీజ్ సమయంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు రాలేదు.భీమ్లా నాయక్ కు ఏపీ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని ముందే ఊహించిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కు నష్టాలు వచ్చినా తానే భరిస్తానని డిస్ట్రిబ్యూటర్లకు హామీ ఇచ్చి సినిమాను విడుదల చేయించారని సమాచారం.

ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

టికెట్ రేట్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా సినిమాను విడుదల చేయాలని పవన్ డిస్ట్రిబ్యూటర్లకు చెప్పి ఒప్పించారని తెలుస్తోంది.ఏ నష్టం వచ్చినా సొంతంగా భరిస్తానని పవన్ డిస్ట్రిబ్యూటర్లకు చెప్పారని సమాచారం.ఈ సినిమా ఎట్టకేలకు రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube