డెస్క్‌టాప్ వినియోగదారులకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫేవరేట్ గా మారిందని చెప్పడంలో సందేహం లేదు.మిగతా అన్ని బ్రౌజర్ల కంటే చాలా ఫాస్ట్ గా ఉండటమే కాదు అనేక సరికొత్త ఫీచర్లను అందిస్తుంది గూగుల్ క్రోమ్.
అలాగే బగ్స్ ను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంది.యూజర్‌కు సేఫ్టీ పరంగా కూడా అద్భుతమైన ఫీచర్లను గూగుల్ క్రోమ్ అందుబాటులో ఉంచింది.
అందుకే ఇది బాగా పాపులర్ అయ్యింది.అయితే ఇది తరచూ సరికొత్త హంగులు దిద్దుకుంటూ మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతోంది.
తాజాగా మరికొన్ని కొత్త ఫీచర్లు తీసుకువచ్చింది.అవేంటో ఇప్పుడు చూద్దాం.
హిస్టరీ జర్నీస్
యూజర్లు వెతికిన సైట్లు, పదాలను ఒక గ్రూపుగా క్రియేట్ చేస్తుంది గూగుల్ క్రోమ్.అయితే వీటన్నింటిలో యూజర్లు ఎక్కువగా ఏ సైట్ సందర్శించారో… ఏ పదాలను సెర్చ్ చేశారో వాటిని మెయిన్ గ్రూప్ గా క్రియేట్ చేస్తుంది.మళ్లీ యూజర్లు వీటిని సెర్చ్ చేసేటప్పుడు వేగంగా ప్రిడిక్షన్స్, సెర్చ్ రిజల్ట్స్ అందిస్తుంది.
హైలెట్ అండ్ షేర్
ఏ వెబ్‌సైట్‌లోనైనా మీకు నచ్చిన కంటెంట్‌ను ఇతరులతో షేర్ చేసుకోవాలనుకుంటే అంతవరకు మాత్రమే సెలెక్ట్ చేసి “కాపీ లింకు టు హైలెట్’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి లింక్ ను షేర్ చేయవచ్చు.అలా షేర్ చేయడం ద్వారా అవతలి వ్యక్తి మీరు హైలెట్ లేదా సెలెక్ట్ చేసిన కంటెంట్‌ను ప్రత్యేకంగా చూడగలుగుతారు.ఇందుకు యూజర్లు కాపీ లింకు టు హైలెట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ట్యాబ్ సెర్చ్
ట్యాబ్ సెర్చ్ ఫీచర్ సహాయంతో మీరు ఏ ట్యాబ్ ని అయినా ఈజీగా సెర్చ్ చేసి కనుగొనవచ్చు.
కొత్త విడ్జెట్లు
ఇన్‌కాగ్నిటో, వాయిస్ సెర్చ్ వంటి విడ్జెట్లను మీరు నేరుగా హోం స్క్రీన్ నుంచే యాక్సెస్ చేసేందుకు వీలుగా ఓ సరికొత్త ఫీచర్ ను గూగుల్ క్రోమ్ తాజాగా తీసుకువచ్చింది.