' రోజా పార్టీ మార్పు ' పై క్లారిటీ వచ్చేసింది !

వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పార్టీలో చాలా ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపులు పనిచేస్తుండడం , తన ఓటమికి ముందు నుంచే ప్లాన్ చేయడం,  పార్టీ కార్యక్రమాలు వేరేగా ఆ వర్గం నిర్వహించడం, అలాగే ఆ వర్గంలోని నాయకులకు రాష్ట్ర స్థాయిలో పదవులు దక్కడం , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి వర్గాలు ప్రోత్సహిస్తున్నట్టుగా వ్యవహరించడం ఇలా అనేక కారణాలతో చాలాకాలం నుంచి ఆమె అసంతృప్తితో ఉన్నారు.

 Nagari Mla Roja Responding On The Issue Of Party Change, Rk Roja, Jagan, Ysrcp,-TeluguStop.com

అంతే కాకుండా,  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ఆమెకు దక్కే ఛాన్స్ లేదనే ప్రచారం ఊపందుకోవడంతో,  ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రచారం మరింత ఉధృతం కావడంతో ఈ వ్యవహారంపై తాజాగా రోజా స్పందించారు.

తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారేదేలేదని, అవసరమైతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతానే తప్ప పార్టీ మారను అంటూ ఆమె చెప్పారు.రాజకీయంగా తనకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని,  అయినా జగనన్న కోసం వాటన్నింటినీ దిగమింగుకుని ముందుకు వెళ్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

తప్పు చేసిన వారే పార్టీ మారతారని రోజా అభిప్రాయపడ్డారు.జగనన్నను ప్రేమించే తాను పార్టీ ఎందుకు మారుతాను అంటూ ఆమె ప్రశ్నించారు.

జగన్ అన్న పార్టీ పెట్టక ముందు నుంచి తాను ఉన్నానని ఆమె గుర్తు చేశారు.ఆడబిడ్డ గా ఇక్కడే ఉండి చస్తానని, ఇక్కడే ఉండి పోరాటం చేస్తానని రోజా అన్నారు.అందరూ పల్లెనుంచి పట్నం వెళ్లి ఇల్లు కట్టుకుంటే, తాను పట్నం నుంచి పల్లెకు వచ్చి ఇల్లు కట్టుకున్నానని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు.రోజా పార్టీ మారకపోయినా ఆమె సొంత పార్టీలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయంలో మరింత క్లారిటీ అయితే వచ్చింది.

ఈ విషయంలో పార్టీ అధినేత సీఎం జగన్ రోజాకు ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాలి.

Nagari Mla Roja Responding On The Issue Of Party Change, RK Roja, Jagan, YSRCP, TDP,Nagari, Nagari MLA, Roja Selvamani, Minister Peddireddy Ramachandra Reddy, - Telugu Jagan, Nagari, Nagari Mla, Rk Roja, Roja Selvamani, Ysrcp

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube