గత కొద్ది నెలలుగా టీమిండియాకు ఏమాత్రం అచ్చి రావడం లేదు.స్టార్ క్రికెటర్లు ఫాం కోల్పోవడంతో టీమిండియా వరుస ఓటములతో సతమతమవుతోంది.
దీనికితోడు అంతర్గత వివాదాలు టీం కాన్ఫిడెన్స్ పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.ఈ నేపథ్యంలో మ్యాచ్‌లు ఆడేందుకు భారత ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే టీమిండియాకి కరోనా రూపంలో మరో దెబ్బ ఎదురయింది.త్వరలోనే వెస్టిండీస్ తో సిరీస్ ఆడి పరాజయాల అవమానాల నుంచి బయటపడాలనుకునే టీమ్ ఇండియాని కరోనా నిండా ముంచేసింది.
ఇప్పుడు ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు, ఐదుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు.
అయితే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి టీమ్ ఇండియా, వెస్టిండీస్ మధ్య ఒక సిరీస్ స్టార్ట్ కావాల్సి ఉంది.
ఇంకో మూడు రోజుల్లోనే సిరీస్ ప్రారంభమవుతుందనగా ఒమిక్రాన్ కలకలం సృష్టించడం ఇప్పుడు అందరినీ నిరాశకు గురి చేస్తోంది.భారత క్రికెట్ ఆటగాళ్లకు, సిబ్బందికి కరోనా సోకినట్లు బీసీసీఐ ధ్రువీకరించింది.
త్వరలోనే సిరీస్ స్టార్ట్ కానున్న క్రమంలో నిబంధనల ప్రకారం, ఈ సిరీస్‌లో పాల్గొనే వారందరికీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేశారు అధికారులు.ఈ పరీక్షల్లో రుత్ రాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్ లకు కరోనా సోకినట్లు తేలింది.
విస్తుగొలిపే అంశం ఏంటంటే ముగ్గురు ప్లేయర్లు దూరమైనా సరే సిరీస్‌ను ఆరంభించేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇలా చేస్తే టీమిండియా ఒడి పోయే ప్రమాదం లేక పోలేదని విశ్లేషకులు అభిప్రాయాలు వినిపిస్తున్నారు.
మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
నరేంద్ర మోదీ స్టేడియంలో ఫిబ్రవరి 6న వన్డే సిరీస్ జరిగితే.టీ20ఐ సిరీస్ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు కోల్‌కత్తాలో జరుగుతుంది.అయితే తాము వన్డే సిరీస్ వాయిదా వేసేందుకు అస్సలు ఇష్టపడటం లేదని ఒక బోర్డు అధికారి తెలిపారు.
కావాలనుకుంటే రిప్లేస్మెంట్ పొందుతామని.మొత్తం మీద 25 మంది ప్లేయర్లు తమకు అందుబాటులో ఉన్నారని.
సెలెక్టర్లు త్వరలోనే రీప్లేస్మెంట్ ప్లేయర్లను కూడా అనౌన్స్ చేస్తారని బోర్డు అధికారి వివరించారు.క్రీడా వర్గాల ప్రకారం ఈ ముగ్గురు ఆటగాళ్లను ఎం.షారుక్‌ఖాన్, ఆర్.సాయి కిషోర్, రిషి ధావన్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.