బాలీవుడ్ బ్యూటీ సీనియర్ నటి అయిన ప్రీతి జింటా గురించి మనందరికీ తెలిసిందే.సొట్ట బుగ్గల సుందరి అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఈమె తన అందం, అభినయం తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ప్రీతిజింటా తన 47వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది.
ఈ సందర్భంగా ఆమెకు క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.అంతేకాకుండా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంస్టాగ్రామ్ లో స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
వారిద్దరూ కింగ్స్ లెవన్ పంజాబ్ ఐపీఎల్ టీమ్ తాలూకు జెర్సీ లు ధరించి ఉన్న ఫోటోను కూడా అప్ లోడ్ చేశాడు.ఈ సందర్భంగా ఆ ఫోటోని షేర్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు.
హ్యాపీ బర్త్ డే ప్రీతిజింటా.ఆ సొట్ట బుగ్గల్ని ఊపేయ్.
నీకు నా తరఫునుంచి బోలెడంత ప్రేమతో పాటుగా హార్దిక శుభాకాంక్షలు అని తెలిపారు యువరాజ్ సింగ్.కీప్ రాకింగ్ దోస్ డింపుల్స్.
అన్న యువరాజ్ సింగ్ కామెంట్ కి నెటిజన్స్ నుంచి భారీగా స్పందన వస్తోంది.సొట్ట బుగ్గల బ్యూటీకి యువరాజ్ ఫాలోవర్స్ కూడా బర్త్డే విషెస్ తెలిపారు.
గతంలో యువరాజ్ సింగ్ ప్రీతి జింటా కు చెందిన ఐపీఎల్ పంజాబ్ క్రికెట్ టీమ్ లో కీలక ఆటగాడిగా కొనసాగాడు.
ఆ సందర్భంలో వారిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది.యువరాజ్ సింగ్ బ్రిటన్ బ్యూటీ హాజెల్ కీచ్ ను పెళ్లి చేసుకోగా, ప్రీతి అమెరికన్ బాయ్ ఫ్రెండ్ జిని గుడ్ ఎనఫ్ తో సెటిల్ అయ్యింది.ఇక యువరాజ్ సింగ్ కూడా ఈ మధ్య తండ్రి అయ్యాడు.
అలాగే ప్రీతి జింటా కూడా సరోగసీ ద్వారా కొద్ది రోజుల క్రితం కవల పిల్లలకు జన్మనిచ్చింది.పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.