మనం ప్రతి రోజూ బొట్టు పెట్టుకునేటప్పుడో.దేవుడికి పూజ చేస్తున్నప్పుడో లేదా ఇంటి గడప వద్ద పసుపు, కుంకుమలతో ముగ్గు పెడుతున్నప్పుడో.
పసుపు, కుంకుమలు జారిపోతే ఏదైనా అశుభం జరిగిపోతుందోమోనని చాలా మంది భయపడిపోతుంటారు.అంతేకాదు తమ పసుపు, కుంకుమలకు ఏదైనా కష్టం కల్గబోతోందా అంటూ కన్నీరు కూడా పెట్టుకుంటారు.
కానీ పసుపు, కుంకుమలు పొరపాటున చేజారిపోతే ఎలాంటి నష్టం కల్గదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
ఎప్పుడైనా కుంకుమ, చేయిజారి కింద పడితే అది అపశకుమనం అనుకోవడం ఒక మానసిక బలహీనతే తప్ప మరే సమస్యలు రావని చెబుతున్నారు.
అంతే కాదండోయ్ పొరపాటున జారిపోయిన పసుపు, కుంకుమలను భూదేవికి సమర్పించినట్లుగా భావించాలని అంటున్నారు.నిజానికి దేవాలయాల్లో మెట్ల పూజలు చేయడం మనం చూస్తేనే ఉంటాం.
మెట్ల పూజ చేసే భక్తులు.ఆ సందర్భంలో అందరూ నడిచే మెట్లపై పసుపు, కుంకుమ పెడ్తుంటారు.
అలాగే పసుపు, కుంకుమ చేజారితే కూడా భూతల్లికి పూజ చేసినట్లేనట.
ఇక నుంచి ఎప్పుడైనా పసుపు, కుంకుమలు కింద పడితే.కీడు జరుగుతుందేమో అని భావిస్తూ భయపడకుండా .పూజ చేసినట్లుగా భావించి భూదేవికి నమస్కరించాలి.అంతా నీ దయే తల్లి అంటూ వేడుకోవాలి.అప్పుడు అంతా మంచే జరుగుతుంది.కానీ కింద పడిన పసుపు, కుంకుమలను ఎత్తడం కానీ మళ్లీ వాటిని మనం పెట్టుకోవడమో,వేరే వారికి పెట్టడమో చేయకూడదు.భూదేవి చెందినది ఆమెకు వదిలేయాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.