ఢిల్లీలో ఒమిక్రాన్ కొత్త స‌బ్ వేరియెంట్ క‌ల‌క‌లం

భార‌త్ లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌గా.రాజ‌ధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కొత్త స‌బ్ వేరియెంట్ క‌ల‌కలం సృష్టిస్తుంది.

 New Sub Variant Of Omicron In Delhi , Carona, Delhi, Omicron Sub Variant, Positivity Rate-TeluguStop.com

ఢిల్లీలోని ఓ ఆస్ప‌త్రికి వ‌చ్చిన శాంపిల్స్ లో ఈ న‌మునాలు గుర్తించిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు.ఒమిక్రాన్ స‌బ్ వేరియెంట్ బీఏ 2.75 చాలా శాంపిల్స్ లో గుర్తించిన‌ట్లు మెడిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సురేష్ కుమార్ వెల్ల‌డించారు.

ఢిల్లీలో క‌రోనా కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్న స‌మ‌యంలో ఆస్ప‌త్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంద‌ని వైద్యులు తెలిపారు.

ఇంత‌కు ముందు ఇన్ ఫెక్ష‌న్ ద్వారా సంక్ర‌మించిన ఇమ్యూనిటీ, వ్యాక్సినేష‌న్ ను లెక్క చేయ‌కుండా ఈ ఒమిక్రాన్ స‌బ్ వేరియెంట్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోందన్నారు.వ్యాప్తి రేటు ఎక్కువ‌గా ఉండే ఈ స‌బ్ వేరియెంట్ కార‌ణంగానే కేసులు పెరిగిపోతున్నాయ‌న్నారు.

90 శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అధ్య‌య‌నాలు చేస్తున్న‌ట్లు చెప్పారు.యాంటీ బాడీలు ఉన్న వాళ్ల‌తో పాటు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వాళ్ల‌పైనా ప్ర‌భావితం చూపిస్తోంద‌ని తెలిపారు.

తీవ్రత త‌క్కువ‌గానే ఉన్నా వ‌య‌సు పైబ‌డిన వాళ్ల‌పై ఇది తీవ్ర ప్ర‌భావితం చూపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.కాగా, ఢిల్లీలో గడిచిన 24 గంట‌ల్లో రెండు వేల‌కు పైగా కేసులు న‌మోదు అవ్వ‌గా.పాజిటివిటీ రేటు 15.41 శాతంగా ఉందని వెల్ల‌డించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube