వాణీ జయరాం విషయంలో ఇలా జరుగుతుందని జ్యోతిష్యుడు ముందే చెప్పాడా.. అదే నిజమైందిగా?

ప్రముఖ గాయని వాణీ జయరాం చెన్నైలోనే తన స్వగృహంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈమె మృతిని అనుమానాస్పద మృతిగా పరిగణించిన పోలీసులు తన మృతికి గల కారణాలు ఏంటి అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

 The Astrologer Prediction Came True In Vani Jayarams Case Details, Astrologer, V-TeluguStop.com

అయితే సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వాణీ జయరాం ఇలా ఉన్నఫలంగా మరణించడంతో సినీ సెలబ్రిటీలు శోకసంద్రంలో మునిగిపోయారు.ఈ విధంగా ఈమె మరణించడంతో ఈమె గత ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన గురించి చెప్పినటువంటి పలు విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Astrologer, Chennai, Legendaryvani, Vani Jayaram, Tollywood-Movie

ఈ క్రమంలోనే వాణీ జయరాం గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జాతకం గురించి ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలను తెలియజేశారు ఈమె పుట్టిన పది రోజులకే తన జాతకం ఎలా ఉండబోతుందో ఓ జ్యోతిష్యుడు చెప్పాడని అయితే ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు జరిగిందని తెలుస్తోంది.ఇలా ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను తన తల్లిదండ్రులకు ఐదవ సంతానం అని తెలిపారు.ఈమె పుట్టిన పది రోజులకే తన తల్లికి తీవ్రమైన జ్వరం వచ్చిందని అలాగే తనకు అప్పటికి ఇంకా నామకరణం కూడా చేయలేదని వాణీ జయరాం తెలిపారు.

Telugu Astrologer, Chennai, Legendaryvani, Vani Jayaram, Tollywood-Movie

ఇలా తాను పుట్టిన పది రోజులకు తన తండ్రి తన పుట్టిన తేదీ తీసుకొని జ్యోతిష్యుడు వద్దకు వెళ్తే ఆయన తన జాతకాన్ని పరీక్షించి తనకు కలైవాణీ అనే పేరు పెట్టమని చెప్పారట.అలాగే ఈ చిన్నారి పెరిగి పెద్దయిన తర్వాత గొప్ప సింగర్ అవుతుందని తాను పది రోజుల వయసు ఉన్నప్పుడే జ్యోతిష్యుడు తన జాతకం చెప్పారని వాణీ జయరాం ఒక ఇంటర్వ్యూ సందర్భంగా జ్యోతిష్యులు చెప్పిన విషయాలను వెల్లడించారు.అయితే ఆయన చెప్పిన విధంగానే ఈమె ఇండస్ట్రీలో గొప్ప సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా వాణీ జయరాం గత ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube