భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.
కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.
ఇకపోతే కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే జస్టిన్ ట్రూడో మంత్రి వర్గంలో మంత్రులుగా పలువురు స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అలాగే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ భారతీయులు రాణిస్తున్నారు.తాజాగా కెనడాలోని అంటారియో ప్రావిన్షియల్ ఎన్నికల్లో పంజాబీ సంతతికి చెందిన 20 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.
మొత్తం 123 స్థానాలకు గాను జూన్ 2న పోలింగ్ జరగనుంది.దేశంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన లిబరల్స్, నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ), ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీ (పీసీ)లు దక్షిణాసియా ప్రజలను, పంజాబీలను టార్గెట్ చేస్తూ ఆయా జాతులకు చెందిన వారినే అభ్యర్ధులుగా నిలబెట్టాయి.
లిబరల్ పార్టీ, ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీల నుంచి ఆరుగురు పంజాబీ అభ్యర్ధులు, న్యూడెమొక్రాటిక్ పార్టీ నుంచి ఐదుగురు పోటీ చేయనున్నారు.పంజాబీ సంతతి ఆధిపత్యం వుండే టొరంటోలోని బ్రాంప్టన్, మిస్సిసాగా శివారులోని 11 నియోజకవర్గాల్లో ఇండో కెనడియన్లు పోటీ చేస్తున్నారు.
ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీ బ్రాంప్టన్ ఈస్ట్ నుంచి హర్దీప్ గ్రేవాల్, బ్రాంప్టన్ వెస్ట్ నుంచి అమన్‌జోత్ సంధు, మిస్సిసాగా మాల్టన్ నుంచి దీపక్ ఆనంద్‌లను పోటీకి దింపింది.లిబరల్స్.
బ్రాంప్టన్ ఈస్ట్ నుంచి జన్నత్ గరేవాల్, బ్రాంప్టన్ నార్త్ నుంచి హరీందర్ మల్హి, బ్రాంప్టన్ వెస్ట్ నుంచి రమ్మీ ఝుజ్, మిస్సిసాగా మాల్టన్ నుంచి అమన్గిల్, బ్రాంట్‌ఫోర్డ్ నుంచి రూబీ టూర్, ఎసెక్స్ నుంచి మన్‌ప్రీత్ బ్రార్‌లను బరిలోకి దింపింది.
ఇక ఎన్డీపీ విషయానికి వస్తే బ్రాంప్టన్ సెంట్రల్ నుంచి సారా సింగ్, బ్రాంప్టన్ నార్త్ నుంచి సందీప్ సింగ్, బ్రాంప్టన్ వెస్ట్ నుంచి నవజోత్ కౌర్, థార్న్ హిల్ నుంచి జస్లీన్ కాంబోజ్‌లను పోటీకి దింపింది. గ్రీన్ పార్టీ .బ్రాంప్టన్ నార్త్ నుంచి అనీప్ ధాడే, డర్హామ్ నుంచి మినీ బాత్రాను నిలబెట్టింది.అంటారియో పార్టీ నుంచి మన్జోత్ సెఖోన్‌ను బరిలోకి దింపింది.2018లో గెలిచిన ఏడుగురు పంజాబీలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.వీరిలో మిస్సిసాగా స్ట్రీట్విల్లే నుంచి నినా టాంగ్రీ, మిల్టన్ నుంచి పార్మ్గిల్, బ్రాంప్టన్ సౌత్ నుంచి పర్బ్మిత్ సర్కారియా బ్రాంప్టన్
.