వారు పెళ్లి చేసుకోవాలంటే పెద్దల అంగీకారం అవసరం లేదట..!

కులమతాలకు అతీతంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే యువతీయువకులకు న్యాయ స్థానాలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాయి.చదువుకున్న యువతీయువకులు తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకొని కులమత వివక్షతలకు చెక్ పెడుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

 They Want To Get Married Delhi Supreme Court, Inter Caste Marraige, Marrahe S,-TeluguStop.com

సమాజంలో శతాబ్దాల కాలం నుంచి నాటుకుపోయిన కులమతాల కట్టుబాట్లు, నిబంధనలు ఇప్పటికీ పెళ్లి విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కానీ ఆ నిబంధనలను పటాపంచలు చేస్తూ నేటి యువత తమకు నచ్చిన వారిని భాగస్వాములు చేసుకుంటున్నారు.

అయితే కులాంతర, మతాంతర వివాహల కారణంగా ప్రజల్లో కాలక్రమేణా అంతరాలు తగ్గిపోతాయని చెబుతూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కి పెద్దల అంగీకారం అక్కర్లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ సంచలన తీర్పు వెలువరించారు.

Telugu Delhi Supreme, Inter Marraige, Marrahes-Latest News - Telugu

రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన విషయం తెలిసిందే.కులం చేత సృష్టించబడిన వేర్పాటువాద భావాలను అంతమోదించాలంటే కులాంతర వివాహాలే పరిష్కారం అని అంబేద్కర్ చెప్పారు.

అదే విషయాన్ని గుర్తు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించారు.

ఈ తీర్పు వెలువరించడానికి కారణం ఎంబీఏ చదువుకున్న ఒక విద్యార్థిని బెంగళూరు నుంచి వెళ్ళిపోయి ఢిల్లీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

అయితే ఆమె బంధువులు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి కేసు నమోదు చేశారు.దీంతో పోలీసులు భర్త ను విడిచి పోలీస్ స్టేషన్ కి రావాలని ఆమెకు తరచూ ఫోన్ చేస్తున్నారు.

తాము చట్టపరంగా పెళ్లి చేసుకున్నామని తనకు తన భర్తని విడిచిపెట్టి రావాల్సిన అవసరం లేదని ఆమె చెప్పింది.దీంతో ఆమె సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగాలని కేసు నమోదు చేసింది.

కాగా, ఈ కేసు పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులను పిలిపించి కులాంతర మతాంతర వివాహాలు చట్టానికి వ్యతిరేకం కాదని కౌన్సిల్ ఇప్పించింది.అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ విషయాలలో చాలా సున్నితంగా వ్యవహరించాలని పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube