కేజీఎఫ్ డైలాగ్స్ ను చూసి ఇదేం సినిమా అనుకున్నా.. నటి షాకింగ్ కామెంట్స్!

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కగా సెకండ్ పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది.కన్నడ ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన తొలి మూవీగా ఈ సినిమా నిలిచింది.80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.

 Kranti Baliwada Interesting Comments About Kgf Movie Details, Kranthi Baliwada,-TeluguStop.com

ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ క్రాంతి బలివాడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీఎఫ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాను హీరోయిన్ రోల్స్ తో పాటు క్యారెక్టర్ రోల్స్ కు డబ్బింగ్ చెప్పానని ఆమె అన్నారు.

అరుంధతి, కేజీఎఫ్ తనకు డబ్బింగ్ విషయంలో మంచి పేరును తెచ్చిపెట్టాయని క్రాంతి బలివాడ అన్నారు.ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో దెయ్యం పాత్ర పోషించిన హీరోయిన్ రోల్ కు డబ్బింగ్ చెప్పానని ఆమె చెప్పుకొచ్చారు.

సీరియల్స్ లో మనసు మమత బాగా పేరు వచ్చిందని రేసుగుర్రం సినిమా నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని క్రాంతి తెలిపారు.

Telugu Actress, Arundhati, Prasanth Neel, Artist, Yash, Kgf Dialogues, Kgf, Kran

దేవుడిచ్చిన పిన్ని డైలాగ్ బాగా గుర్తింపు తెచ్చిపెట్టిందని క్రాంతి వెల్లడించారు.అరుంధతి సినిమాలో రవిశంకర్ వాయిస్ తో మ్యాచ్ చేసే విషయంలో ఇబ్బంది ఎదురైందని క్రాంతి పేర్కొన్నారు.కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాలో రిపోర్టర్ వాయిస్ ఆఫర్ వచ్చినప్పుడు ఏదో కన్నడ మూవీ డబ్బింగ్ చెబుతున్నానని అనుకున్నానని క్రాంతి తెలిపారు.

Telugu Actress, Arundhati, Prasanth Neel, Artist, Yash, Kgf Dialogues, Kgf, Kran

ఆ పాత్రకు తాను చాలా క్యాజువల్ గా చెప్పానని ఆ డైలాగ్స్ చెప్పే సమయంలో నాకు అర్థం కాలేదని ఆమె పేర్కొన్నారు.ఆ పాత్ర ఏం చేశాడు మీ హీరో అంటుందని దేనికి అంటాడో అలా నాకు అర్థం కాలేదని ఎక్కడుంది ఆ ఎల్డోరా డోన్ అనే డైలాగ్ చెబుతూ ఎల్డోరా డోన్ అంటే ఏమిటని అడిగానని ఆమె చెప్పుకొచ్చారు.చెప్పిన డైలాగ్స్ అన్నీ కట్స్ అని గ్రాంథికంను రామాయణంతో మిక్స్ చేసి చెబుతున్నానని తనకు అర్థమైందని ఆమె తెలిపారు.ఆ సినిమా నాకు సీరియస్ గా అర్థం కాలేదని ఆ డైలాగ్స్ నేనే చెప్పానా అని అనిపించిందని క్రాంతి వెల్లడించారు.

అనుష్క, భూమిక, నమితలకు తాను డబ్బింగ్ చెప్పానని క్రాంతి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube