టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శరత్ బాబు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.తెలుగుతో పాటు ఇతర భాషల్లో శరత్ బాబు 220కు పైగా సినిమాల్లో నటించారు.
హీరోగానే కాకుండా తండ్రి పాత్రలలో, విలన్ పాత్రలలో శరత్ బాబు నటించడం గమనార్హం.ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ కాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఈయన పేరు శరత్ బాబుగా మారింది.
శరత్ బాబు తన సినీ కేరీర్ లో మూడుసార్లు సహాయ నటుడిగా నంది పురస్కారంను సొంతం చేసుకున్నారు.తొలిసారి సీతాకోక చిలుక సినిమాకు శరత్ బాబుకు నంది అవార్డ్ రాగా ఓ భార్య కథ, నీరాజనం సినిమాలకు కూడా నంది అవార్డులు దక్కాయి.
తాజాగా శరత్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా అనేది నా ప్రాణమని నా జీవితమని తెలిపారు.సినిమాల గురించే మనసు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుందని శరత్ బాబు పేర్కొన్నారు.
సినిమాలలోని పాత్రల గొప్పదనం వల్లే తనకు మంచిపేరు దక్కిందని శరత్ బాబు చెప్పుకొచ్చారు.తనకు చాలామంది మంచి స్నేహితులు ఉన్నారని శరత్ బాబు పేర్కొన్నారు.
అప్పట్లో తనకు వందలాది ఉత్తరాలు వచ్చేవని ఆ లెటర్స్ ను తాను స్పెషల్ గా దాచుకునేవాడినని శరత్ బాబు వెల్లడించారు.టైమ్, ఫైనాన్స్, హెల్త్ విషయంలో తాను క్రమశిక్షణతో ఉంటానని శరత్ బాబు పేర్కొన్నారు.
సినిమానే తనకు పెద్ద బలహీనత అని ఆ బలహీనతను మించి మరే బలహీనత లేదని శరత్ బాబు వెల్లడించారు.తనకు పుస్తకాలు కొన్ని విషయాలను నేర్పాయని జీవితం అన్ని విషయాలను నేర్పిందని శరత్ బాబు పేర్కొన్నారు.నా ప్రయాణాన్ని ఒక పుస్తకంగా రాయాలని ఉందని శరత్ బాబు అన్నారు.వైవాహిక జీవితం గురించి తాను అప్పుడే సమాధానం ఇచ్చానని మళ్లీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని శరత్ బాబు వెల్లడించారు.