రాధేశ్యామ్‌ మ్యూజిక్ ఖర్చు.. సౌత్‌ లోనే రికార్డ్‌ తెలుసా!

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ విడుదలకు సిద్దం అయ్యింది.సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఇప్పటికే బిజినెస్ చేశారు.

 Prabhas Radheshyam Movie Music Cost , Prabhas , Flim News, News About Radheshyam-TeluguStop.com

ఇక ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు.దాదాపుగా 80 కోట్లతో వందకు పైగా సెట్టింగ్స్ ను వేయించిన దర్శకుడు ఈ సినిమా సంగీతం కోసం ఏకంగా 20 కోట్ల వరకు ఖర్చు చేశాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్ అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ తో ఈ సినిమాకు వర్క్‌ చేయించాడనే వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం రాధే శ్యామ్‌ కోసం ఆయన బీజీ వర్క్ చేయిస్తున్నాడు.

అందుకు గాను అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నట్లుగా చెబుతున్నారు.

Telugu Radeshyam, Prabhas-Movie

రాధే శ్యామ్‌ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు 200 కోట్లకు పైగా ఖర్చు అయ్యిందట.షూటింగ్ పూర్తి అయిన తర్వాత మరో వంద కోట్లకు పైగా ఖర్చు చేశారని అంటున్నారు.మొత్తానికి ఇంత భారీ బడ్జెట్‌ సినిమాను ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.

సాహో సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఈ సినిమాను కూడా విడుదల చేయడం జరిగింది.ప్రస్తుతం సినిమా చివరి దశ పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా వర్గాల వారు మరియు ప్రేక్షకులు రాధే శ్యామ్‌ సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో పెంచుకున్నారో ప్రతి ఒక్కరికి తెల్సిందే.రాధే శ్యామ్‌ సినిమా లో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు టీ సిరీస్ వారితో కలిసి నిర్మించారు.కృష్ణం రాజు ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube