ఏపీలో టిడిపి జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయి.ఈ విషయాన్ని జగన్ ముందుగానే గుర్తించారు.
అందుకే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే తలెత్తే పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తున్నారు.రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారనే విషయం పైన జగన్ దృష్టి సారించారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంత జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని జగన్ అంచనా వేస్తున్నారు .అందుకే ఆయా ప్రాంతాల్లో వైసిపి పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయం పైన రకరకాల మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నారు.నియోజకవర్గంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ? వారిపై జనాల్లో ఎంతవరకు ఆదరణ ఉంది అనే విషయాలను సర్వేల ద్వారా జగన్ తెలుసుకుంటున్నారు.
టిడిపి, జనసేన పొత్తు ఖాయం అయితే ఆయా నియోజకవర్గాల్లో వైసిపి విజయానికి ఎటువంటి ఆటంకాలు ఏర్పడతాయి ? ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంత వరకు ఆ నియోజకవర్గంలో నెగ్గుకు రాగలరు అనే విషయాన్ని జగన్ పూర్తిగా తెలుసుకునే పనిలో ఉన్నారు.ఇప్పటికే అందిన సర్వే రిపోర్ట్ ప్రకారం దాదాపు 30 , 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేనట్లు తెలుస్తోంది.ఈ మేరకు సదరు ఎమ్మెల్యేలు కూడా పరోక్షంగా సంకేతాలు అందుతున్నాయట.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంత మెరుగ్గా లేదు.ఇప్పటికీ చాలా బలహీనపడింది.
2024 ఎన్నికల్లో టిడిపి ఓటమి చెందినా, ఆ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందని, అప్పుడు తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని జగన్ భావిస్తున్నారు.
అందుకే టిడిపి మళ్లీ అధికారంలోకి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే వైసీపీ లోనూ భారీ ఎత్తున ప్రక్షాళన చేసి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట.ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీమ్ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తుంది.నియోజకవర్గంలో బలంగా ఉన్న నేతలు ఎవరు అనే విషయం పైన దృష్టిసారించింది .దీనికి సంబంధించిన రిపోర్టర్లను ఎప్పటికప్పుడు జగన్ కు అందిస్తూ ఉండడంతో, రాబోయే ఎన్నికల్లో జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట.ఈ పరిణామాలన్నీ ప్రస్తుత వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన పెంచుతోంది.