మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవలే యాక్సిడెంట్ అయ్యి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ పై సాయి తేజ్ ప్రమాదానికి గురి అవవడంతో ఆసుపత్రిలో చేరాడు.
ఇక అప్పటి నుండి దాదాపు 35 రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఈ రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్టు మెగా హీరోలు తెలిపారు.
అయితే ఈ రోజు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా హీరోలు వరుస ట్వీట్స్ చేస్తూ అభిమానులకు సంతోష కరమైన వార్తను చెప్పారు.
సాయి తేజ్ డిశ్చార్జ్ అయినట్టు చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.సాయి తేజ్ పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వచ్చినట్టు తెలిపారు.ఈ రోజు మా ఇంట్లో విజయదశమి మాత్రమే కాదు మరొక ప్రత్యేకమైన విశేషం కూడా ఉంది.యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన తేజ్ నేడు పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వచ్చాడని తనకి ఇది పునర్జన్మ లాంటిదని తెలిపాడు.
ఇక సాయి తేజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పాడు.
ఇక చిరు తో పాటు పవన్ కళ్యాణ్ కూడా సాయి తేజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
జనసేన పార్టీ తరపున ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.ప్రమాదం బారిన పడిన సాయి తేజ్ ఈ రోజు ఇంటికి తిరిగి వచ్చాడని పండగ పర్వదినాన మా కుటుంబం అందరికి సాయి తేజ్ ఇంటికి రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని.ఈ రోజు సాయి తేజ్ పుట్టిన రోజు అని.ప్రేక్షకుల ప్రేమాభిమానాలు మరింత పొందాలని కోరాడు.
తేజ హాస్పిటల్ లో చేరినప్పటి నుండి అభిమానులు కూడా ఎంతో బాధపడి తేజ్ క్షేమంగా రావాలని కోరుకున్నారని వారందరి ఆశీర్వాదాలు ఫలించి సాయి ధరమ్ తేజ్ క్షేమంగా ఇంటికి వచ్చాడని వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.ఇక రామ్ చరణ్ కూడా సాయి తేజ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపూతూ పోస్ట్ పెట్టాడు.సాయి తేజ్ ను ముద్దు పెట్టుకుంటున్న ఫోటో పెట్టి బర్త్ డే విషెస్ చెప్తూ నీతో కలిసి డాన్స్ వేయడానికి వెయిట్ చేస్తున్నానని ట్వీట్ చేసాడు.