పెళ్లి సందD రివ్యూ: సందడే లేని పెళ్లి సందD

స్టార్ డైరెక్టర్రాఘవేంద్ర రావుపర్యవేక్షణలో మోడ్రన్ పెళ్లి సందడిగా ఈ రోజు థియేటర్ లో తెరకెక్కించిన సినిమా పెళ్లి సందDఈ సినిమాకు కొత్త దర్శకుడు గౌరీ రోనంకి దర్శకత్వం వహించాడు.ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో రూపొందించిన ఈ సినిమాలో ఒకప్పటి హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించాడు.

 పెళ్లి సందd రివ్యూ: సందడే లేని -TeluguStop.com

కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్ గా నటించింది.మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్ పై కె.కృష్ణమోహన్ ఈ సినిమాను సమర్పించాడు.కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.ఇదిలా ఉంటే ఈ రోజు ఈ సినిమా విడుదల సందర్భంగా రోషన్ కు ఈ సినిమా సక్సెస్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

కథ:

ఈ సినిమాలో రోషన్ వశిష్ట పాత్రలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తాడు.తనకు తండ్రి పాత్రలో రావు రమేష్ నటించాడు.శ్రీలీలా సహస్ర పాత్రలో నటించింది.ఇక వశిష్ట విల్ పవర్ ను బాగా నమ్ముతాడు.దీంతో తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో గట్టిగా చెబుతాడు.

ఇక తన సోదరుడి పెళ్ళికి వెళ్లగా అక్కడ సహస్రని చూసి ఇష్టపడతాడు.సహస్ర కూడా అతని ప్రేమలో పడుతుంది.

ఇక కొన్ని సంఘటనల వల్ల వీరి ప్రేమ మధ్య కొన్ని మలుపులు కనిపిస్తాయి.దీంతో వారి ప్రేమకు సమస్యగా మారుతుంది.

ఇక వశిష్ట వీటినన్నింటిని ఎలా చేధించి చివరికి తనను ఎలా కలుసుకుంటాడు అనేది మిగిలిన కథ లోనిది.

Telugu Keeravani, Pelli Sandad, Rao Ramesh, Review, Roshan Meka, Sree Leela, Tol

నటినటుల నటన:

రోషన్, శ్రీలీలా తమ పాత్రలతో అద్భుతంగా మెప్పించారుబ్రహ్మానందం, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ పాత్రలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.చాలా వరకు పాత్రల మధ్య సంభాషణలు బాగా మెప్పించాయి.

టెక్నికల్:

ఈ సినిమాకు సంగీతాన్ని కీరవాణి అద్భుతంగా అందించాడు.బ్యాక్ గ్రౌండ్ కూడా బాగా ఆకట్టుకుంది.భారీ ఖర్చులతో భారీ సెట్టింగ్ చేశారు.సినిమాటోగ్రఫీ బాగానే ఉంది.

Telugu Keeravani, Pelli Sandad, Rao Ramesh, Review, Roshan Meka, Sree Leela, Tol

విశ్లేషణ:

ఈ సినిమాలో రోషన్ చూడడానికి అందంగా కనిపించాడు.రోషన్ తన పాత్రతో బాగా మెప్పించాడు.ఇందులో కొన్ని సన్నివేశాలు బాగా ఎమోషనల్ గా అనిపించాయి.

స్టోరీ లైన్ అద్భుతంగా ఉన్నా కూడా కాస్త ఆకట్టుకునే విధంగా కథనాలను రాయలేదు.ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ లో ఎమోషనల్ ను బాగా నడిపించాలని ప్రయత్నించినా కూడా మెప్పించలేకపోయింది.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, పాటలు, విజువల్స్ బాగా ఆకట్టుకున్నాయి.

Telugu Keeravani, Pelli Sandad, Rao Ramesh, Review, Roshan Meka, Sree Leela, Tol

మైనస్ పాయింట్స్:

కథ బాగా సాగినట్లు అనిపించింది.సింపుల్ గా, బోరింగ్ గా అనిపించింది.కథలో కొత్తదనం కనిపించలేదు.

బాటమ్ లైన్:

ఈ కథలో కొత్తదనం అనేది ఎక్కువగా పరిచయం చేయలేదు డైరెక్టర్.చాలా వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా కూడా ఎందుకో మెప్పించలేదనిపిస్తుంది.

రేటింగ్: 2.25/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube