ఆ నినాదాన్ని ఎత్తుకోని ఈట‌ల‌.. మ‌రి తీన్మార్ మ‌ల్ల‌న్న ఏం చేస్తారో..?

కార‌ణాలు ఏవైనా కూడా బీజేపీ క్ర‌మ క్ర‌మంగా తెలంగాణ‌లో బ‌ల‌ప‌డుతోంది.మొన్న‌టి వ‌ర‌కు కాస్త అటు ఇటుగానే ఉన్న ఆ పార్టీలోకి ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉన్న నేత‌లు వ‌స్తుండ‌టంతో బ‌ల‌ప‌డుతోంద‌నే చెప్పాలి.

 Etala Did Not Take Up The Slogan ..what Do Teenmar Mallannas Do Teenmar Mallann-TeluguStop.com

ఇక‌పోతే రాజ‌కీయంగా ఎన్ని వ్యూహాలు అమ‌లు చేసినా కూడా ప్ర‌తి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి.ఎవ‌రు అందులోకి వ‌చ్చినా ఆ సిద్ధంతాల‌కు లోబ‌డే ప‌నిచేయాలి.

లేదంటే అందులో ఇమ‌డ‌డం చాలా క‌ష్టం.ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ ప‌రిస్థితి కూడా ఇలాగే క‌నిపిస్తోంది.

వ్య‌క్తిగ‌తంగా ఈట‌ల రాజేంద‌ర్ లెఫ్ట్ సిద్ధాంతాల‌ను న‌మ్మేవాడు.

అలాంటి ఆయ‌న అనుకోకుండా బీజేపీలో చేరారు.

అయితే ఆయ‌న పెద్ద‌గా బీజేపీ రాజకీయాలను ఫాలో కావ‌ట్లేదు.ఇంకా చెప్పాలంటే బీజేపీ రాజ‌కీయాల‌తో ఆయ‌న కొంత నైరాశ్యంతోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

బీజేపీ సిద్ధాంతాల‌ను ఆయ‌న ఎక్క‌డా వినిపించ‌ట్లేదు.సాధార‌ణంగా బీజేపీ నేత‌లు ప్రసంగించేముందు జై శ్రీరాం అనే నినాదంతో మొద‌లు పెడ‌తారు.

చివ‌ర‌కు కూడా జై శ్రీరాంతో పాటు భార‌త్ మాతాకీ జై అంటూ ముగిస్తారు.కానీ ఇంత వ‌ర‌కు ఈట‌ల అలాంటి నినాదాన్ని ఇవ్వ‌లేదు.

కార‌ణం ఆయ‌న మొద‌టి నుంచి క‌మ్యూనిస్టు భావాలు ఉన్న వ్య‌క్తి.

Telugu Bandi Sanjay, Bjp, Etala Rajender, Huzurabad, Trs, Ts Poltics-Telugu Poli

ఇక ఇప్పుడు తీన్మార్ మ‌ల్ల‌న్న కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.కానీ తీన్మార్ మ‌ల్ల‌న్న కూడా మొద‌టి నుంచి బ‌హుజ‌న‌వాదంతో రాజ‌కీయాలు చేస్తున్నారు.ఆ నినాద‌మే ఆయ‌న్ను ఇండిపెండెంట్‌గా అయినా కూడా మంచి ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ ను చేసింది.

కానీ బీజేపీలో చేరితే మాత్రం బ‌హుజ‌న నినాదాన్ని వ‌దిలి జై శ్రీరాం నినాదాన్ని ఎత్తుకోవాల్సిందే.మ‌రి ఆయ‌న ఆ నినాదాన్ని ఎత్తుకుంటారా లేదంటే ఈట‌ల లాగే సైలెంట్‌గా ఉంటారా అనేది మాత్రం పెద్ద ప్ర‌శ్న‌గా మిగిలిపోతుంది.

ఏదేమైనా బీజేపీలోకి వెళ్తున్న వారంతా కూడా ఆ సిద్ధాంతాలు న‌చ్చ‌క‌పోయినా ర‌క్ష‌ణ కోస‌మే వెళ్తున్నార‌నే ప్ర‌చ‌రాం బాగా న‌డుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube