తమన్నాకు అదంటే చాలా ఇష్టమట.. ఒక్కరోజులోనే అన్నీ?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి మిల్కీబ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు.అదేవిధంగా మాస్టర్ చెఫ్ కార్యక్రమం ద్వారా బుల్లితెరపై వ్యాఖ్యాతగా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

 Actress Tamannaah Shares Her Favorite Food Tollywood, Tamannaah, Favorite Food,-TeluguStop.com

తాజాగా తమన్నా మాదాపూర్ లోని వెస్టిన్‌ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ తన అభిరుచులను గురించి తెలియజేశారు.

తనకు తెలుగు వంటకాలు అంటేనే ఎంతో ఇష్టమని మన వంటకాలు మన సంస్కృతిని చాటిచెబుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ముఖ్యంగా తమన్నాకు రసం, చేపల పులుసు కనిపిస్తేచాలు తినకుండా అస్సలు ఉండలేనని, వీటితో ఫుల్లుగా లాగించేస్తానని ఈ సందర్భంగా తన కిష్టమైన ఆహార పదార్థాల గురించి తెలియజేశారు.

Telugu Citimmar, Favorite, Fish Curry, Master Cheif, Tamannaah, Tollywood, Tv Sh

సినిమాల ద్వారా మాత్రమే కాకుండా బుల్లితెరపై మాస్టర్ చెఫ్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడం చాలా ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా తమన్నా తెలియజేశారు.ఇక ఈ కార్యక్రమానికి అల్లు శిరీష్,ఇన్నోవేటివ్‌ ఫిలిం అకాడమీ ఫౌండర్‌ శ్రావణ ప్రసాద్, ఎఫ్ చలపతిరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తమన్నా గోపీచంద్ సరసన నటించిన సిటీ మార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇవే కాకుండా మరో రెండు మూడు సినిమాలలో కూడా తమన్నా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube