ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలుగా గుర్తింపును సంపాదించుకున్న సినీ ప్రముఖులకు హ్యాకర్స్ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.టీవీ యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న యాంకర్లలో గాయత్రి భార్గవి ఒకరు.
సినిమాల్లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటించిన గాయత్రి భార్గవికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే తాజాగా గాయత్రి భార్గవి ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయింది.
పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్న గాయత్రి భార్గవి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటారు.గాయత్రి భార్గవి పోలీసులను సంప్రదించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఫేస్ బుక్ అకౌంట్ తో పాటు ఈమెకు ఫేస్ బుక్ పేజ్ కూడా ఉండగా ఆ పేజ్ కూడా హ్యాక్ అయినట్టు తెలుస్తోంది.హ్యాక్ చేసిన హ్యాకర్లు ఆమె ఖాతా నుంచి అసభ్యకర సందేశాలు పోస్ట్ చేస్తున్నారని సమాచారం.
సెలబ్రిటీలు కానీ సామాన్యులు కానీ సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కాకుండా ఉండాలంటే తరచూ తప్పనిసరిగా పాస్ వర్డ్స్ ను మార్చాలి.
పబ్లిక్ ప్లేస్ లలో ఉండే వైఫైని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు.గతంలో కూడా పలువురు సెలబ్రిటీల ఖాతాలు హ్యాక్ కాగా పోలీసులు, వ్యక్తిగత బృందం కృషి చేసి ఆ ఖాతాలను సాధారణ స్థితికి తెచ్చారు.గాయత్రి భార్గవి ఇచ్చిన ఫిర్యాదు గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరుగుతుంటే సైబర్ మోసాలు సైతం అదే స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.ఇతరుల ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లలో సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేయడం వల్ల కూడా ఇబ్బందులు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.గాయత్రి భార్గవి అకౌంట్ రికవరీ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.