' ఈటెల ' ఒంటరేనా ? బీజేపీ లో ఎవరికి వారేనా ?

టిఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ ఎంత బలమైన నీతో బీజేపీ నేతలకు తెలియంది కాదు.ఆయన్ను ఉపయోగించుకునే తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ మొదట్లో  అభిప్రాయపడింది.

 Bjp, Etela Rajendar, Hujurabad, Telangana, Bandi Sanjay, Kishan Reddy, Hujurabad-TeluguStop.com

ఈ మేరకు రాజేందర్ కు తగిన ప్రాధాన్యం ఇస్తూనే, ఆయన్ను ప్రోత్సహిస్తూ వస్తోంది. హుజురాబాద్ ఎన్నికల్లో ఈ మేరకు రాజేందర్ గెలుపు కోసం బిజెపి హైకమాండ్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాడుతాం అన్నట్లుగా మొదట్లో బీజేపీ కీలక నాయకులంతా హడావుడి చేశారు.

అయితే రాను రాను బిజెపిలో రాజేందర్ ఒంటరివాడే అన్న అభిప్రాయం మొదలయిపోయింది.ఎందుకంటే హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు రాజేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

పోటీ అంతా రాజేందర్ టిఆర్ఎస్ మధ్యే అన్నట్టుగా పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇక రాజేందర్ సైతం అదేవిధంగా  వ్యవహరిస్తూ వస్తున్నారు.

ఇక మిగతా బీజేపీ నాయకులు సైతం రాజేందర్ విషయంలో అదే విధంగా వ్యవహరిస్తున్నారు.రాజేందర్ ప్రభావం కనుక పార్టీలో పెరిగితే తమ ప్రాధాన్యత తగ్గి పోతుందేమోనన్న భయం నాయకుల్లో ఉండడంతో, వారు హుజరాబాద్ ప్రచారంలో అంతా ఆసక్తిగా లో పాల్గొనడం లేదు అనే చర్చ జరుగుతోంది.

బీజేపీలో చేరిన దగ్గర నుంచి అయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు .పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరి పూర్తిగా కోలుకోకుండానే ఆయన డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు.

Telugu Bandi Sanjay, Etela Rajendar, Hujurabad, Kishan Reddy, Padayathra, Telang

అయితే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 24వ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని చూస్తున్నారు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఆశీర్వాద యాత్ర చేపడుతున్నారు.ఇద్దరు బీజేపీ నాయకులు విడివిడిగా పాదయాత్ర చేపడుతున్నా తీరు రాజేందర్ కు ఇబ్బందికరంగా మారింది.వీరి మధ్య ఉన్న గ్రూపు రాజకీయాల కారణంగా రాజేందర్ పై ఆ ప్రభావం పడుతోంది.ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం చాలా మంది బీజేపీ నేతలకు అసలు ఇష్టం లేదు.

అయితే బీజేపీ హైకమాండ్ సూచనలతో రాజేంద్ర రాకను స్వాగతించినా, పెద్దగా సహకరించడంలేదని రాజేందర్ వర్గీయుల ఆవేదన.

అటు బండి ఇటు, కిష్ణ రెడ్డి వర్గాలు పెద్దగా సహకరించకపోవడంతో, రాజేంద్ర తనకు ఉన్న బలం, బలగంతో ఎన్నికల్లో గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఈ నేతలంతా హుజురాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఫలితం ఉంటుంది.కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడంతో  ఈ రకమైన ఇబ్బంది వచ్చిపడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube