చాలా మంది తమ ఇండ్లలో పెంపుడు జంతువులను పెంచుకోవడం చూస్తూనే ఉంటాం.ఎందుకంటే వారికి అవంటే అంత ప్రేమ ఉంటుంది.
ఇక ఇప్పటికే ఎంతో మంది వీటిని తమ ఇండ్లలోని మనుషులతో సమానంగా చూసుకుంటారు.ఇక ఈ జంతువుల్లో ఎక్కువగా పిల్లులు లేదా కుక్కలు మాత్రమే ఎక్కువగా పెంచుకుంటారు.
ఇక వీటికి కూడా ఎంతో విశ్వాస పాత్రులు అనే పేరు కూడా ఉంది.యజమానులను ఇవి అమితంగా ప్రేమిస్తుంటాయి.
మనం ఇప్పటికే ఎన్నో రకాలుగా యజమానులను కాపాడిన పిల్లులు లేదా కుక్కలు అనే వార్తలు వినే ఉంటాం.యజమానులను కాపాడేందుకు అవి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన ఘటనలు కూడా చూసే ఉంటాం.
ఇక ఇప్పుడు అలాంటి పిల్లిని కాపడేందుకు ఓ మహిళ చేసిన పోరాటం గురించే మనం తెలుసుకోబోయేది.ఎందుకంటే ఇప్పటికే ఆమెతన పిల్లిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం చూస్తూ అంతా షాక్ అవ్వాల్సిందే.
ఏకంగా ఆ మహిళ ఓ తాడుకట్టుకుని మరీ తన పిల్లిని కాపాడుకునేందుకు పాడుబడ్డ బావిలోకి దిగింది.అంతే కాదు తన ప్రాణాలను కూడా రిస్క్‌లో పెట్టి మరీ ఆ చిన్ని ప్రాణాన్ని కాపాడింది.
నిజానికి ఆ బావి పూర్తిగా పాడుబడి చాలా భయంకరంగా ఉండటంతో చూస్తేనే వణుకు పుడుతోంది.మరి ఇంత ప్రమాదకరమైన బావిలోకి దిగి మరీ అందులో ఉన్న చెట్లూ అలాగే పొదల్లాంటి వాటిని తొలగిస్తూ తన పిల్లిని కాపాడుకుంది ఆమె.ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ సాహసంలో భర్త ఉన్నా కూడా ఆయన బావి పై నుంచి తాడు పట్టుకుని మాత్రమే ఉన్నారు.కానీ మహిళ మాత్రం ఎంతో సాహసం చేసి పిల్లి ప్రాణాలు కాపాడింది.
కర్నాటకలోని మంగళూరులో జరిగింది ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.