చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కనిక పురం గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.విద్యుత్ ఘాతంతో అదే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే కనికాపురం గ్రామానికి చెందిన మునిస్వామి నాయుడు తన ఇంటి నిర్మాణానికి టిప్పర్ తో కంకర లోడ్ తేప్పించు కొన్నారు.ఈ క్రమంలో లారీ డ్రైవర్ మనోజ్ కంకర లోడ్ ఇంటి వద్ద దింపటానికి లారీ ని వెనక్కి తీసుకు వస్తూ పైనున్న విద్యుత్ వైర్లను పట్టించుకోకుండా.
టిప్పర్ వెనక భాగం పైకి ఎత్తడం జరిగింది.ఇదే సమయంలో టిప్పర్ కి కరెంటు వైర్లు తగలటంతో ఒక్కసారిగా షాక్ కొట్టడంతో డ్రైవర్ మనోజ్ కేకలు వేయటం జరిగింది.
ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన యువకులు దొరబాబు (23), జ్యోతి శ్వర్ (19) డ్రైవర్ మనోజ్ నీ కాపాడే ప్రయత్నం చేయగా విద్యుత్ ఘాతానికి గురై వాళ్ళిద్దరూ కూడా అక్కడికక్కడే మృతి చెందారు.దీంతో వెంటనే సంఘటన తెలుసుకొని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంత .పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి విచారణ స్టార్ట్ చేశారు.గ్రామానికి చెందిన యువకులు కళ్ళముందు కరెంటు షాక్ తో చనిపోవటంతో గ్రామస్తులు ఎంతో బాధ పడ్డారు.
చేతికందిన కొడుకులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.ఈ క్రమంలో పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.