అయ్యోపాపం.. ఆప‌రేష‌న్ కోసం పెట్టుకున్న డ‌బ్బుల్ని ఎలుక‌లు..!

రెక్కల కష్టం ఎలుకలపాలైంది.అవునండీ ఓ వ్యక్తి తన హెల్త్ బాగు చేయించడం కోసం దాచిపెట్టుకున్న మనీని ఎలుకలు తినేశాయి.

 Alas The Rats Doubled For The Operation Rat, 2 Lakhs, Operation , Mahabubabad,-TeluguStop.com

కాగా, కష్టపడి రూపాయి రూపాయి కూడేసుకున్న డబ్బులను కొరికి నాశనం చేయడంతో సదరు వ్యక్తి ప్రస్తుతం బాధపడుతున్నాడు.చినిగిన డబ్బును తీసుకుని రిజర్వు బ్యాంకు వద్దకు వెళ్లి తన పరిస్థితిని వివరించినా అతడికి న్యాయం జరగలేదు.

ఈ నేపథ్యంలో తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

వివరాల్లోకెళితే మహబూబాబాద్ జిల్లా వేంనూర్ శివారు ఇందిరానగర్​ తండాకు చెందిన రెడ్యా అనే వ్యక్తి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో ఒకరోజు అతడు అనారోగ్యం పాలయ్యాడు.వైద్యుల వద్దకు వెళ్లగా, కడుపులో కణితి అవుతున్నదని, దాన్ని తొలగించాలని చెప్పారు.అందుకు డబ్బులు లేవని చెప్పి వెనుదిరిగి వచ్చిన రెడ్యా రోజుకు కొన్ని డబ్బులు సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు.తన అనారోగ్యం నయం చేసుకునేందుకు ఇలా చేస్తుండగా ఇటీవల ఆయనకు కడుపు నొప్పి వచ్చింది.

వెంటనే ఆస్పత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుందామనుకున్నాడు.అందుకు డబ్బులు తీసుకెళ్దామని బీరువా ఓపెన్ చేసి చూడగా, డబ్బులు రూ.2 లక్షలు చెల్లా చెదురై ఉన్నాయి.

Telugu Lakhs, Mahabubabad, Redya, Reserv Bank-Latest News - Telugu

ఏళ్ల నుంచి రూపాయి రూపాయి పోగేసుకోగా, వాటిని ఎలుకలు కొరికి కొరికి నాశనం చేశాయి.ఆ డబ్బుల పరిస్థితి చూసి ఖంగు తిన్నాడు రెడ్యా.తన సర్జరీకి రూ.4 లక్షలు అవుతాయని వైద్యులు చెప్తుండగా, రూ.2 లక్షలు ఇలా అయ్యాయని రెడ్యా బాధపడుతున్నాడు.ఆ డబ్బులు తీసుకోవాలని పలు బ్యాంకుల వద్దకు వెళ్లిన రెడ్యా తాజాగా హైదరాబాద్ రిజర్వ్ బ్యాంకు కార్యాలయానికి వెళ్లాడు.అయితే, ఆఫీసర్లు తన మొరను వినడం లేదు.

4 ఏళ్ల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తనకు ప్రభుత్వం సాయం చేయాలని, సర్జరీ చేయించి తనకు ఆరోగ్యం ప్రసాదించాలని రెడ్యా కోరుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube