ముగ్గురు యువకుల అతితెలివి.. షాక్ ఇచ్చిన పోలీసులు

ప్రస్తుతం ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేది కేవలం రోడ్డు ప్రమాదాల వల్లే.ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వాలు పోలీసులు ఎంతలా వాహనదారుల్లో అవగాహన తెస్తున్నా కూడా కొంత మంది చేసే చేష్టలతో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరులా మారుతున్నాయి.

 Cyberabad Traffic Police Funny Meme On Youth Violating Traffic Rules, Hyderabad,-TeluguStop.com

కొంత మంది చాలా తెలివిగా… పోలీసుల కళ్లకు కనిపించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నామని అనుకున్నా… ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ సాయంతో పోలీసులు ఇట్టే పట్టేస్తున్నారు.అసలు చాలా మంది వాహనదారులు పోలీసుల కోసం వారు విధించే ఫైన్లను తప్పించుకోవడం కోసమే ట్రాఫిక్​ రూల్స్​ పాటిస్తున్నారేమో అనే అనుమానం చాలా మందిలో కలగక మానదు.

  ఇలా చేస్తూ హైదరాబాద్​ లో కొందరు యువకులు పోలీసుల కళ్లు గప్పి ట్రాఫిక్​ నిబంధనలను అతిక్రమించామని అనుకోగా… వారి ఆలోచనలను పోలీసులు పటాపంచలు చేశారు.ఇంతకీ ఏం జరిగిందంటే…


సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ కూడా ధరించకుండా వాహనంపై ప్రయాణించారు.

అంతే కాకుండా వాహనాన్ని నడుపుతున్న యువకుడు ఒక్క చేత్తో డ్రైవ్ చేస్తూ.మరో చేత్తో ఫోన్ వాడుతున్నాడు.

అలాగే మధ్యలో ఉన్న యువకుడు సైతం ఫోన్‌లో నిమగ్నమై పోయాడు.ఇక చివరన కూర్రున్న వ్యక్తి తన కాలుతో నెంబర్ ప్లేట్​ కనబడకుండా దాన్ని కవర్ చేశాడు.

కానీ ట్రాఫిక్ పోలీసులు అంతే తెలివిగా… ఆ వాహనదారుడికి షాక్​ ఇచ్చారు.అక్షరాలా 3,200 రూపాయల జరిమానా విధించారు.

దీనిపై పోలీసులు సోషల్​ మీడియా వేదికగా స్పందిస్తూ… ఫన్నీ మీమ్​ విడుదల చేశారు.అంతే కాకుండా వారికి విధించిన ఫైన్​ వివరాలు, వారు చేసిన తప్పులను కూడా పోస్ట్ చేశారు.

అంతే కాకుండా ఆ ట్వీట్​ కు బ్రహ్మానందం ఫొటోను కూడా జత చేశారు.ఇది సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube