దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది.వారి అకౌంట్‌లు భద్రంగా ఉండటానికి కోన్ని సేఫ్టీ రూల్స్‌ను పాటించమని కోరింది.
లేకపోతే వారి ఖాతాకు సంబంధించిన డేటాను హ్యాకర్లు చోరీ చేసే అవకాశముందని హెచ్చరించింది.ఇది కొద్ది రోజులుగా పరిశోధనలు చేసి, కొంత మంది మోసపోయిన వారు కూడా ఉన్నారు.
ఈ విధంగా తమ ఇతర కస్టమర్లు మోసపోకూడదని హశ్రీచ్చరిక చేసింది.తాజాగా కొన్ని బోగస్ యాప్‌ల వల్ల కూడా డేటా చోరీ అవుతోందని ఇటీవల ఎస్‌బీఐ అకౌంట్ హోల్డర్లను హె చ్చరించింది.
తెలియని లింక్‌ల ద్వారా వచ్చే యాప్‌లను డౌన్‌లోడ్‌చేసుకోకూడదని తెలిపింది.ఈ విషయాన్ని ట్వీటర్ వేదికగా ఖాతాదారులకు అలర్ట్ చేసింది.
‘మీ భద్రతే మాకు ప్రాముఖ్యత! అని ఈ సేఫ్టీ రూల్స్‌ను పాటిస్తే.మీ పర్సనల్, ఫైనాన్షిల్ డేటాను కోల్పోకుండా ఉంటారని ట్వీట్ చేసింది.
కేవలం వెరీఫై చేసిన యాప్లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి తెలియని వ్యక్తులు పంపిన యాప్ లింక్‌లను ఓపెన్ చేయకూడదని సూచించింది.దీనివల్ల హ్యాకర్స్ సులభంగా ఓటీపీ, పిన్, సీవీవీ నంబర్లను హ్యాక్ చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.
ఖాతాదారుల భద్రతకు కొన్ని టిప్స్…
మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే పుట్టిన రోజు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు, ఇంటర్నెట్ యూజర్ ఐడీలను ఎవరితోనూ షేర్ చేయకూడదు.
బ్యాంక్ కేవైసీ అంటూ కొందరు బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి మోసం చేసే అవకాశం ఉంది.తెలియని ఈ మెయిల్స్‌ను కూడా ఓపెన్ చేయకూడదు.తెలియని యాప్‌లను కూడా డౌన్‌లోడ్ చేయకూడదు.ఖాతాదారులు ఈ టిప్స్‌ను పాటించి తమ విలువైన ఇన్ఫర్మేషన్ పర్సనల్ లేదా ఫైనాన్షియల్ డేటా చోరీకి ఆస్కారం ఇవ్వకండి.గతంలో కూడా ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు క్యూఆర్ కోడ్‌కు సంబంధించిన మోసంపై కూడా హెచ్చరించింది.
హ్యాకర్లు క్యూఆర్ కోడ్ పంపించి స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయని ట్రాప్ చేశారు.స్కాన్ చేస్తే ఖాతాదారులు తమ డబ్బులు పోగొట్టుకోవాల్సి వచ్చింది.