బన్నీతో క్లాస్ లో ముచ్చట్లు పెట్టేదాన్ని.. నటి కామెంట్స్ వైరల్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2020 సంవత్సరంలో అల వైకుంఠపురములో సినిమాతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించారు.ప్రస్తుతం బన్నీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై దృష్టి పెట్టగా పుష్ప పార్ట్ 1ను నిర్మాతలు 120 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం.

 30 Weds 21 Fame Ananya Shocking Comments About Allu Arjun,latest News-TeluguStop.com

ఈ సినిమా తరువాత బన్నీ ఐకాన్ సినిమాను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.

అయితే ఈ మధ్య కాలంలో 30 వెడ్స్ 21 అనే వెబ్ సిరీస్ ద్వార పాపులారిటీని సంపాదించుకున్న అనన్య అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.ప్రస్తుతం ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న అనన్య తాను అల్లు అర్జున్ కు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు.తనకు కలలో అల్లు అర్జున్ ఎక్కువగా వచ్చేవారు కాదని కానీ ఒకరోజు మా స్కూల్ లో మా క్లాస్ లో అల్లు అర్జున్ నేను ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకున్నామని వెల్లడించారు.

ఒక సినిమాలో యాక్టింగ్ గురించి తాను అల్లు అర్జున్ క్లాస్ లో కూర్చుని మాట్లాడుకున్నామని అనన్య పేర్కొన్నారు.ఆ రోజంతా తాను సంతోషంగా ఉన్నానని అల్లు అర్జున్ ను కలిశానని ఆనందపడ్డానని అనన్య వెల్లడించారు.

బన్నీ తనకు చాలా నచ్చాడని అందుకే తాను అభిమానిని అయ్యానని అనన్య పేర్కొన్నారు.రియల్ లైఫ్ లో కూడా ఛాన్స్ వస్తే మీట్ అవుతానని అనన్య వెల్లడించారు.

విజయదేవరకొండ అంటే చాలా అభిమానమని ఆమె తెలిపారు.హీరోయిన్స్ లో తనకు నయనతార అంటే ఎక్కువగా ఇష్టమని అనన్య పేర్కొన్నారు.హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలు ఉన్న అనన్య భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తే మాత్రం అనన్య ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube