దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా మాస్ సినిమాలనే తెరకెక్కించారు.అయితే మగధీర సినిమా తరువాత తన శైలికి భిన్నంగా రాజమౌళి సునీల్ తో మర్యాదరామన్న, ఈగ సినిమాలు తెరకెక్కించారు.
విజువల్ వండర్ గా ఈగ సినిమా తెరకెక్కగా ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి చాలా భయపడ్డారని ఒక దశలో సినిమాను ఆపేయాలని అనుకునేంతలా భయపడ్డారని సమాచారం.
టాలీవుడ్ ఖ్యాతిని పెంచేసిన ఈగ సినిమా టైటిల్ కు సంబంధించిన ప్రకటన వచ్చినప్పుడు కొంతమంది ఆ టైటిల్ పై విమర్శలు చేశారు.
అయితే ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈగను డిజైన్ చేసే విషయంలో రాజమౌళి కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈగ సీన్స్ రాజమౌళి అనుకున్న విధంగా రాలేదట.
గ్రాఫిక్స్ లో ఈగ బాగా లేకపోవడంతో సినిమా రిజల్ట్ విషయంలో రాజమౌళి భయపడ్డారని సమాచారం.
అయితే అప్పటికే 10 కోట్ల రూపాయలు ఖర్చు కావడంతో నిర్మాతకు 10 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని భావించి రాజమౌళి మళ్లీ ఈగ డిజైన్ విషయంలో వర్క్ చేశారని సమాచారం.మళ్లీ ఈగపై కొత్తగా ఫోటో షూట్ లు చేసి రాజమౌళి సినిమాను తెరకెక్కించగా 35 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈగ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో పాటు క్రిటిక్స్ నుంచి కూడా పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది.
తెలుగుతో తమిళం, హిందీ భాషల్లో ఈగ మూవీ రిలీజ్ కాగా హిందీలో మాత్రం ఈగ భారీగా కలెక్షన్లను సాధించలేకపోయింది.
రాజమౌళి మధ్యలోనే సినిమాను ఆపేసి ఉంటే నిర్మాతకు 10కోట్ల రూపాయల నష్టం వచ్చేది.సినిమా రిలీజైన తర్వాత ఈగ నిర్మాతకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం.
సమంత, నాని, సుదీప్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.