వేటాడటంలో చిరుత పులికి సాటి ఏదిలేదనే విషయం తెలిసిందే.అయితే చిరుత పులి ఒక్కసారి ఏ జంతువుపైనైనా గురి పెడితే ఇక అది బతికి బట్ట కట్టడం అనేది జరగని పని.
కాని కొన్ని కొన్ని సార్లు చిరుతపులికే ఝలక్ ఇస్తుంటాయి కొన్ని జంతువులు.అలా మనం చాలా వీడియోలను మనం చూశాం.
పులి తనకు తానుగా గొప్పగా భావించి చిన్న చిన్న జంతువుల దగ్గర బొక్కాబోర్లా పడుతుంది.అచ్చం ఇలాగే ఓ సంఘటన జరిగింది.
ప్రస్తుతం ఈ వార్తా నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక అసలు విషయం లోకి వెళ్తే కుందేలు ఎంత వేగంగా పరుగెత్తుతుందో మనకు తెలిసిందే.
ఇక కుందేలును మామూలుగా పట్టుకోవడమే అసాధ్యం.ఇక ఏదైనా కఠిన పరిస్థితులలో దాని వేగం మరింత పెరుగుతుంది.
అయితే అడవిలో అలా సంచరిస్తున్న పులి కంట్లో కుందేలు పడింది.
ఇంకేముంది దాని స్వభావానికి తగ్గట్టు కుందేలును వేటాడుదామని ప్రయత్నించింది.
మెల్లగా కుందేలు వైపు పులి వెల్లసాగింది.కుందేలు కూడా పులి కదలికలను జాగ్రత్తగా గమనిస్తోంది.
ఒక్కసారిగా పులి కుందేలుపై దాడి చేయడానికి ప్రయత్నించగా కుందేలు పులిని బోల్తా కొట్టిచ్చి రెప్పపాటులో పులి చెర నుండి తప్పించుకుంది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక వీడియో చూస్తున్న నెటిజన్లు కుందేలు తప్పించుకోవాలి అనుకున్నట్లుగానే తప్పించుకోవడంతో నెటిజన్లు ఊపిరి పీల్చుకున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.