ఎన్టీఆర్ బుల్లి తెర షో ఎవరు మీలో కోటీశ్వరులు సెకండ్ ప్రోమో కూడా వచ్చేసింది.వచ్చే నెల నుండి ఈ షో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ప్రోమోలో షో పై అంచనాలు ఆకాశానికి పెంచేస్తున్నాయి.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ షో ను ఎన్ని వారాలు కొనసాగిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.
మామూలుగా అయితే కౌన్ బనేగా కరోడ్ పతి షో దాదాపుగా 100 ఎపిసోడ్ ల వరకు కొనసాగుతుంది.కాని ఎన్టీఆర్ మాత్రం 100 ఎపిసోడ్ లు అంటే కష్టం కనుక 60 ఎపిసోడ్ లకు మొదటి సీజన్ ను చూసి ఆ తర్వాత టాక్ ను బట్టి మార్చుకుందాం అంటూ సూచించాడట.
ఎన్టీఆర్ ఈ షో కు ఒప్పుకోవడమే ఎక్కువ.అలాంటి ఆయనకు కండీషన్స్ పెట్టగలమా అనుకున్న మేకర్స్ వెంటనే ఓకే చెప్పారని సమాచారం అందుతోంది.
గతంలో స్టార్ మా లో వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో మాత్రం దాదాపు గా వంద ఎపిసోడ్ లు ప్రసారం అయిన విషయం తెల్సిందే.
ఎన్టీఆర్ గతంలో బిగ్ బాస్ ను కూడా తక్కువ రోజులే చేశాడు.60 రోజుల పాటు కొనసాగిన తెలుగు బిగ్ బాస్ సూపర్ హిట్ అయ్యింది.ఆ తర్వాత వచ్చిన మూడు ఎపిసోడ్ లు కూడా వంద రోజులకు మించే నడిపించారు.
అయినా కూడా ఎన్టీఆర్ హోస్ట్ చేసినప్పుడు వచ్చిన స్టార్ డం మరియు రెవిన్యూ రాలేదు అనడంలో సందేహం లేదు.అందుకే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ ను షార్ట్ అండ్ స్వీట్ అంటూ ఉంటారు.
ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు కూడా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చేరువ అయ్యేలా ఎవరు మీలో కోటీశ్వరులు ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
.