రక్తహీనత లేదా ఎనీమియా.నేటి కాలంలో ఎందరినో పట్టి పీడిస్తున్న సమస్య ఇది.మహిళల్లో, చిన్నారుల్లో ఈ సమస్య అత్యధికంగా కనిపిస్తుంది.ప్రధానంగా ఐరన్ లోపం వల్ల రక్త హీనత సమస్య ఏర్పడుతుంది.
ఇక రక్త హీనత ఏర్పడిందంటే.నీరసం, అలసట, కళ్లు పాలిపోవడం, ఆయాసం, గుండె దడ, కాళ్లు మరియు చేతులు చల్లబడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఆరోగ్యం క్షీణించి.ప్రాణాలకే ముప్పుగా మారుతుంది.
అందుకే రక్త హీనతను నివారించుకోవడం చాలా అవసరం.అయితే రక్త హీనతకు చెక్ పెట్టడంతో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.అలాంటి వాటిలో సగ్గుబియ్యం కూడా ఒకటి.సగ్గుబియ్యంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియంతో పాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.
అందువల్ల, రక్త హీనత సమస్యతో బాధ పడే వారు సగ్గుబియ్యాన్ని తీసుకుంటే.ఐరన్ లోపం తగ్గుముఖం పడుతుంది.
మరియు ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఫలితంగా రక్త హీనత సమస్య దూరం అవుతుంది.
మరి ఇంతకీ సగ్గుబియ్యాన్ని ఎలా తీసుకోవాలి అన్న సందేహం మీకు రావొచ్చు.సగ్గు బియాన్ని పాలలో లేదా నీళ్లలో ఉడికించి బెల్లం కలిపి తీసుకోవడం, కిచిడి రూపంలో తీసుకోవడం, ఇతర వెజిటేబుల్స్ తో కలిపి తీసుకోవడం, పునుగులు వేసి తీసుకోవడం చేయాలి.ఇలా ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు.రక్త హీనతను నివారించడంతో పాటు సగ్గుబియ్యంతో మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.దాంతో నీరసం, అలసట వంటి సమస్యలు దూరం అవుతాయి.
అలాగే సగ్గుబియ్యం తరచూ తీసుకుంటే.ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.
జీర్ణ క్రియను మెరుగుపరిచి.గ్యాస్, కడుపులో మంట, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
కాబట్టి, రక్త హీనత ఉన్న వారే కాదు.అందరూ సగ్గుబియ్యాన్ని డైట్‌లో చేర్చుకోవచ్చు.