తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 11 సంవత్సరాలైనా ఇప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఏ మాయ చేశావె మూవీ నుంచి ప్రేక్షకులను మాయ చేస్తున్న సమంత వెండితెరపై మాత్రమే కాదు బుల్లితెరపై, ఓటీటీలలో కూడా సందడి చేస్తూ ప్రతిభను చాటుకుంటున్నారు.
నాలుగేళ్ల క్రితం అక్కినేని నాగ చైతన్యను సమంత వివాహం చేసుకున్నారు.
అయితే చైతన్య కుటుంబం గురించి అన్ని విషయాలు తెలిసినా సమంత ఫ్యామిలీ గురించి ఆమె అభిమానులకు కూడా ఎక్కువగా తెలియదు.
సమంత కుటుంబం చెన్నైలో స్థిరపడగా సమంత తల్లి నివెట్ కేరళకు చెందినవారని తండ్రి ప్రభు మాత్రం తెలుగు వాళ్లని తెలుస్తోంది.కుటుంబంలో సమంతనే చిన్న అని చెన్నైలోనే విద్యాభ్యాసం చేసిన సమంత మోడలింగ్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టారని సమాచారం.
తమిళంలో సమంత మొదట మాస్కోవిన్ కావేరి అనే సినిమాలో హీరోయిన్ గా ఎంపిక కాగా ఏ మాయ చేశావె సినిమా మొదట విడుదలైంది.ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు రావడం, సమంత స్టార్ హీరోయిన్ గా ఎంపిక కావడం జరిగింది.ఒకవైపు సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న సమంత మరోవైపు సాకీ వరల్డ్ పేరుతో దుస్తుల వ్యాపారం చేస్తోంది.సామాన్యులు, సెలబ్రిటీలు అందరికీ అందుబాటులో ఉండే ధరలతో సమంత సాకీ వరల్డ్ ను ప్రారంభించారు.
గతేడాది జాను సినిమా విడుదలైన తరువాత కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని సమంత ఏడాది చివరలో శాకుంతలం సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించారు.శాకుంతలం సినిమా తరువాత సమంత నటించబోయే సినిమాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.శాకుంతలం సినిమాలో సమంత శాకుంతలంగా కనిపిస్తున్నారు.సమంత నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం ఇదే కావడం గమనార్హం.