ఉపాసన కొణిదెల మెగాస్టార్ చిరంజీవి కోడలిగా రామ్ చరణ్ భార్యగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ భాద్యతలు నిర్వహించడంతోపాటు సామజిక కార్యక్రమాలతో ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ కష్టాల్లో ఉండే ఎంతో మందికి అండగా నిలుస్తుంది.
సెలెబ్రిటీల డైట్ గురించి ఇంటర్వ్యూ చేస్తూ అప్పుడప్పుడు ఆరోగ్య సూత్రాలను కూడా షేర్ చేస్తూ ప్రజలకు చేరువవుతుంటుంది.
రామ్ చరణ్, ఉపాసన జంట గురించి అందరికి తెలుసు.
రామ్ చరణ్ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటే ఉపాసన వ్యాపార వ్యవహారాలతో బిజీగా ఉంటుంది.కానీ ఎంత బిజీగా ఉన్నా వాలంటైన్స్ రోజు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంటామని తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది.
అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ లో జరిగే చాలా విషయాలను పంచుకుంది.
అంతేకాదు మేము కూడా అందరి దంపతుల మాదిరిగానే పోట్లాడుకుంటాం.వాదన చేసుకుంటాం.ఇలాంటి సంఘటనలు వైవాహిక జీవితంలో ఉంటేనే చాలా బాగుంటుంది.
గొడవ కారణంగా మా మధ్య ఉండే పరిస్థితులను మాటల్లో వర్ణించలేము.జీవితంలో ఉండే ఒడిదుడుకులను మేము గౌరవించుకుంటాం.
రామ్ చరణ్ వాలంటైన్స్ డే రోజు చాలా బహుమతులను ఇచ్చారు.కానీ అందులో నాకు బాగా గుర్తుండిపోయే ఒక బహుమతి ఉంది.హృదయపు ఆకారంలో ఉండే ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చారు.ఇప్పటికే నేను వాటిని దాదాపు ప్రతి రోజు పెట్టుకుంటుంటాను అని చెప్పారు.
అయితే బహుమతుల కంటే మేము కలిసి పంచుకున్న మధురమైన సంఘటనలు గుర్తుచేసుకుని ఆ రోజు ఆనందంగా గడుపుతాం.
బహుమతులు కంటే మెమొరీస్ నాకు చాలా ఇష్టం.
ఆ రోజు మేము కలిసి కూర్చుని టీవీ చూస్తాం.మాకు ఇష్టమైన పనులన్నీ చేసుకుంటాం.
ఈసారి వాలంటైన్స్ డే ఆదివారం రావడంతో ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.లైఫ్ లో మేము సాధించాలన్న జీవిత లక్ష్యాలను మరొక సారి చర్చించుకోవడానికి ఈ రోజు మేము ఎంచుకుంటాం అని ఉపాసన తెలిపారు.