పోలీసుల లాఠీ చార్జీలను లెక్క చెయ్యకుండా ఎర్రకోటకు చేరుకున్న రైతులు

కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని రైతులు గత నెల రోజుల పైగా డిల్లీ వీధుల్లో నిరసన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఈ విషయంపై కేంద్రా వ్యవసాయ మంత్రి అధ్వర్యంలో చర్చలు జరుగుతున్న అవి నేటికి సఫలం కాకపోవడంతో నేడు రిపబ్లిక్ డే ను పురష్కరించుకొని డిల్లీ లోని ఎర్రకోటను ముట్టడించారు.

 Farmers Agitation At Red Fort -new Farmmer Acts-bjp-central Govt-delhi-after Flg-TeluguStop.com

ఈ రోజు ఉదయం జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం రైతులు పెద్ద ఎత్తున్న ట్రాక్టర్స్ ర్యాలీలు చేపట్టారు.పోలీసులు అడ్డుతగిలిన ట్రాక్ట్రర్స్ తో ర్యాలీగా ఎర్రకోట వరకు వెళ్లారు పెద్ద పెద్ద నినాదాలతో ఎర్రకోట మారుమోగిపోయింది.

Telugu Farmers, Schems, Red Fort-General-Telugu

జాతీయ జెండా ఎగరవేసిన చోటే రైతులు తమ జెండాను కూడా ఎగరవేశారు.ముందుగా డిల్లీ లోని ఐ‌టి‌ఓ వద్ద పోలీసులకు, రైతులకు పెద్ద ఎత్తున గర్షణ జరిగింది.పోలీసు లు తమ లాఠీలకు పని చెప్పి రైతులను చెదరగొట్టాలని చూశారు కానీ రైతులు ట్రాక్టర్స్ తో పోలీసులపైకి దూసుకురావడంతో వెనక్కి తగ్గారు.డిల్లీ లోని ఎర్రకోట ప్రాంగణం మొత్తం రైతుల ట్రాక్టర్స్ తో నిండి పోయింది.

ఎటు చూసిన డిల్లీ మొత్తం రైతులే కనిపిస్తున్నారు.ఈ ఘటనపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

దేశ చరిత్రలో ఎర్రకోట సాక్షిగా రైతులపై దాడులు జరగడం బి‌జే‌పి ప్రభుత్వం అధికారంలోనే మొదటిసారని ఆరోపిస్తున్నాయి.ఈ సందర్భంలో రైతులకు తమ సానుభూతిని తెలియజేస్తున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube