గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ రూపంలో అందరిని భయపెట్టిందో అందరికి తెలిసిందే.ప్రతి ఒక్కరు ఈ కరోనా ఎఫెక్ట్ ని పేస్ చేశారు.
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు.ఇక లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి మృతి చెందారు.
కోట్లాది మంది కరోనా కోరల్లో చిక్కుకొని ప్రాణాలతో బయటపడ్డారు.ఈ కరోనా ఎంత భయంకరంగా ఉంటుందో దాని బారిన పడిన వారికి తెలుస్తుంది.
ఇదిలా ఉంటే కరోనా భయం నుంచి ప్రజలందరూ మెల్లగా బయటపడి ఎవరి పనులలో వారు బిజీ అవుతున్నారు.ఈ సమయంలో బ్రిటన్ లో మళ్ళీ కరోనా సరికొత్తగా రూపాంతరం చెంది కొత్త స్టెయిన్ తో కోరలు చాచింది.
దీని దాడి నుంచి బయటపడటానికి మరల బ్రిటన్ లో లాక్ డౌన్ విధించారు.ఇండియాలో ఈ కొత్త స్టెయిన్ అంత ప్రమాదకరంగా లేదని చెప్పాలి.
అయితే ఇప్పుడు ఇండియాలో కరోనాలోనే మరో కొత్త స్టెయిన్ ని మెడికల్ సైంటిస్ట్ లు గుర్తించారు.
యాంటీ బాడీలకి దొరకకుండా తనని తాను మార్చుకుంటు మరింత ప్రమాదకరంగా మారుతున్న కొత్త కరోనా స్టెయిన్ ని మ్యుటేషన్ ని గుర్తించారు.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌కు చెందిన ముగ్గురు కరోనా పేషెంట్ల శాంపిల్స్‌లో ఈ మ్యుటేషన్‌ను కనుగొన్నది ఖర్గార్‌లోని టాటా మెమోరియల్ సెంటర్.దీనిని ఈ484కే మ్యుటేషన్‌గా పిలుస్తున్నారు.సౌతాఫ్రికాలో కనిపించిన మూడు మ్యుటేషన్లలో ఇదీ ఒకటని ఇక్కడి అసోసియేట్ ప్రొఫెసర్ నిఖిల్ పట్కార్ వెల్లడించారు.మొత్తం 700 శాంపిల్స్‌కు జెనెటిక్ సీక్వెన్సింగ్ చేస్తుండగా అందులో ముగ్గురిలో ఈ మ్యుటేషన్ కనిపించినట్లు చెప్పారు.
ఇది శరీరంలోని యాంటీ బాడీస్‌ను బోల్తా కొట్టిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపారు.బ్రిటన్ లో కనిపించిన కొత్త స్టెయిన్ మ్యుటేషన్ కంటే ఇది అత్యంత ప్రమాదకరమైనదని ప్రొఫెసర్లు చెబుతున్నారు.
మరి దీనిపై ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో వెళ్తుంది అనేది చూడాలి.