సమంత శాకుంతలం ఇంట్రెస్టింగ్ అప్డేట్‌, గుణశేఖర్‌ తీరు మార్చుకున్నాడా?

అయిదు సంవత్సరాల క్రితం రుద్రమదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుణశేఖర్‌ ఆ తర్వాత ఇప్పటి వరకు మరే సినిమాను మొదలు పెట్టలేదు.ఆమద్య రానాతో హిరణ్యకశ్యప సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు.

 Guna Shekhar Movie Shakuntalam Release Next Sankranti Or Summer , Samantha, Rudr-TeluguStop.com

కాని బడ్జెట్‌ కారణంగా సినిమాను ఇప్పట్లో పట్టాలెక్కించే పరిస్థితి లేదు అని మరో సినిమాను ప్రకటించాడు. శాకుంతలం అనే పౌరాణికం ను గుణశేఖర్‌ ఇప్పటికే ప్రకటించాడు.

కొత్త సంవత్సరం సందర్బంగా సినిమాలో సమంత నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.ఒక యంగ్‌ హీరో ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాను తన గత సినిమాల మాదిరిగా మరీ ఎక్కువ సమయం చేయకూడదని గుణశేఖర్‌ భావిస్తున్నాడట.

Telugu Guna Shekhar, Gunashekhar, Hiranya Kasyapa, Samantha, Shakuntalam-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను సమ్మర్‌ లో పట్టాలెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ లోనే విడుదల చేయాలని భావిస్తున్నాడట.ఈ సినిమా కోసం భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ను గుణశేఖర్‌ అంతర్జాతీయ ప్రమాణాలతో అందించబోతున్నాడట.ఈ సినిమాతో గుణశేఖర్‌ భార్య నిర్మాతగా మారబోతున్నట్లుగా కూడా ఇప్పటికే ప్రకటన వచ్చింది.

గుణశేఖర్‌ సినిమాకు సినిమాకు ఏళ్ల గ్యాప్ ఉండటం వల్ల ఆయన నుండి ఎన్నో మంచి సినిమాలను మిస్ అవుతున్నాం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అందుకే శాకుతలం సినిమాను వచ్చే సంక్రాంతికే విడుదల అయ్యేలా ప్లాన్‌ చేయడంతో పాటు వెంటనే హిరణ్యకశ్యప సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు గుణశేఖర్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

మొత్తానికి గుణ శేఖర్‌ తన పంథా ను మార్చకోవడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గుణశేఖర్‌ ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ తో బిజీగా ఉన్నాడు.

మరో వైపు తన గత సినిమాల మాదిరిగా భారీ సెట్టింగ్ లను వేయించకుండా సింపుల్‌ గానే ఈ సినిమాను తీయబోతున్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube