ఇంట్లో స్పటిక లింగాన్ని పూజించవచ్చా?

సాధారణంగా మనం శివలింగాలను ఎక్కువగా దేవాలయాలలో మాత్రమే పూజించడం చూస్తుంటాము.కానీ కొందరికి శివలింగాన్ని ఇంట్లో పూజించుకోవచ్చా అనే సందేహాలు కలుగుతుంటాయి? అయితే ముఖ్యంగా శివలింగాలలో స్పటిక శివలింగాన్ని ఇంట్లో పూజించుకోవడం మంచిదేనా?స్పటిక లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే సందేహాలు చాలా మందిలో తలెత్తుతాయి.అయితే స్పటిక శివలింగాన్ని ఇంట్లో పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

 Spatika Lingam Pooja Vidhanam At Home, Spatika Lingam , Pooja Vidhanam , Lingam-TeluguStop.com

స్పటిక లింగాన్ని ఇంట్లో పూజించుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అయితే ఈ స్పటిక లింగం మన ఇంట్లో ఉండడం వల్ల ప్రతి రోజు పాలు, పండ్ల రసం, పరిశుభ్రమైన నీటితో అభిషేకం నిర్వహించాలి.

అభిషేకం అనంతరం పువ్వులతో అలంకరించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి.ఈ విధంగా ప్రతిరోజు స్పటిక లింగాన్ని పూజించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.

Telugu Pooja Vidhanam, Spatika Lingam, Spatikalingam, Worship Linga-Latest News

స్పటికంతో తయారైన శివలింగం మాత్రమే కాకుండా స్పటికంతో తయారైన విగ్నేశ్వరుని విగ్రహాన్ని కూడా పూజించడం వల్ల మన ఇంట్లో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.ముఖ్యంగా స్పటిక శివలింగానికి విభూతితో అభిషేకం ఎంతో ప్రీతికరమైనది.ఈ విధంగా విభూతి అభిషేకం చేయడం ద్వారా నవ గ్రహ దోషాలు తొలగిపోతాయి.అభిషేక అనంతరం శివ లింగం ముందు కూర్చుని 108 సార్లు పంచాక్షరీ మంత్రాన్ని జపించటం వల్ల అనుకున్న కోరికలు తీరడంతోపాటూ, అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది.

స్పటిక శివలింగాన్ని మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎంతో నియమ నిష్టలతో ప్రతిరోజు అభిషేకాలను, పూజలను నిర్వహించవలసి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.స్పటిక శివలింగం ముందు కూర్చుని కేవలం పంచాక్షరి మంత్రమే కాకుండా, లక్ష్మీ అష్టోత్తరం కూడా పట్టించవచ్చు.

ఈ విధంగా స్పటిక శివలింగానికి ప్రత్యేక పూజలను చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube