ట్రాఫిక్ చలాన్ లు పెండింగ్ లో ఉన్నాయా..? ఇకపై ట్రాఫిక్ పోలీసులు నేరుగా..?!

నగరాలలో, మహానగరాలలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికీ పోలీసులు చలానాలు వేయడం మనం తరచూ చూస్తున్న వ్యవహారమే.అయితే, ఆ చలనాలను మరోసారి వీలైనప్పుడు ఎప్పుడైనా కట్టొచ్చని వదిలేసే వారు ఎందరో.

 Police To Collect Traffic Challans, Pending Traffic Challans, Mumbai Cops, 300cr-TeluguStop.com

అయితే ఇప్పుడు ట్రాఫిక్ చలానాలు పెండింగ్ లో ఉంటే మాత్రం అతి త్వరలో ట్రాఫిక్ పోలీసులు మీ ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొట్టి సమయం ఆసన్నమైంది.పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానా ఫీజులను వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కొత్త కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
దేశంలో వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన ముంబై మహానగరంలో రావాల్సిన చలానాల సొమ్ము భారీగా పేరుకుపోయాయి.

అది ఎంతలా అంటే.ఏకంగా 300 కోట్లకు పైగా చలానా సొమ్ము పెండింగ్ లో ఉన్నాయి.

అయితే దీనిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లియర్ చేయడానికి ట్రాఫిక్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ పోలీసులను జరిమాన పడిన వాహనదారుడి ఇంటికి వెళ్లి మరి జరిమానాలు వసూలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించబోతున్నారు.

ఇందులో భాగంగానే ముంబై నగరంలో ఇద్దరు పోలీసులతో 11 బృందాలను ఏర్పాటు చేయగా, ఇకముందు ఎవరైనా సరే పెండింగ్ లో ఉంటే ముందుగా ఆ సమాచారాన్ని కాల్ సెంటర్ ద్వారా వాహనదారులకు తెలియజేసి ఆ తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చి మరి పెండింగ్ లో ఉన్న చలానా సొమ్మును వసూలు చేస్తారు.

Telugu Challans, Mumbai Cops-Latest News - Telugu

అయితే, ఈ చర్యలు కేవలం పెండింగ్ లో ఉన్న బకాయిలను రికవరీ చేయడం కోసమే నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.అయితే ఈ ప్రతిపాదనను ప్రస్తుతం హోంమంత్రిత్వ శాఖకు పంపించామని.కాకపోతే, ఇంకా తమకి అనుమతి రాలేదని అధికారులు తెలుపుతున్నారు.ఒకవేళ ఇందుకు సంబంధించి అనుమతి వస్తే మాత్రం ట్రాఫిక్ పోలీసులు నేరుగా వాహనదారుడు ఇంటికి వెళ్లి e-చలానాలు సంబంధించిన పెండింగ్ సొమ్మును వసూలు చేస్తారని అధికారులు తెలుపుతున్నారు.4 సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన e-చలానా ద్వారా చెల్లింపులు చేయడంలో వాహనదారులు కాస్త బద్దకిస్తున్నారన్న విషయం అందరికి తెలిసిందే.ఇలా చలానా కట్టని వారి ఇంటికి వెళ్లి ట్రాఫిక్ పోలీసులు నగదు తీసుకుని అందుకు సంబంధించిన రసీదును వెంటనే వాహనదారునికి అందిస్తారని ఒకవేళ చెల్లించని పక్షంలో డబ్బులు వీలైనంత త్వరగా కట్టాలని ట్రాఫిక్ సిబ్బంది కోరనున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube