అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బిడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారనే విషయం అందరికి తెలిసిందే.ఇంకా అధికారికంగా అధ్యక్ష హోదాలోకి రాకముందే బిడెన్ సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు.
అమెరికన్స్ అందరూ ఔరా అనేలా దాదాపు ప్రపంచం మొత్తం నివ్వెర పోయేలా కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాదు ఇప్పటి వరకూ ఏ ఒక్క అమెరికా దేశాధ్యక్షుడు క్రియేట్ చేయని రికార్డ్ లు సృష్టించేస్తున్నారు.వైట్ హౌస్ లో కీలక కమిటీలలో మహిళలకే అధిక ప్రాధాన్యతను ఇచ్చారు.అలాగే
కీలక కమిటీలలో, ఇప్పటి వరకూ ఏర్పాటు చేసిన కమిటీలు అన్నిటిలో బిడెన్ భారతీయ ఎన్నారైలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.తాజాగా బిడెన్ తీసుకున్న మరో నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
ఇంతకీ ఏమిటా నిర్ణయం.అమెరికా రక్షణ శాఖా మంత్రి గా ఓ ఆఫ్రో అమెరికన్ ను నియమించడానికి ట్రంప్ సిద్దమయ్యారు.
ఇప్పటి వరకూ అంటే అమెరికా చరిత్రలో ఓ ఆఫ్రో అమెరికన్ ను రక్షణ శాఖ మంత్రిగా నియమించిన దాఖలాలు లేవు.
ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లాయిడ్ ఆస్టిడ్ కీలక పదవిలో రక్షణ దళంలో సేవలు అందించారు.2003 లో బాగ్దాద్ లోని అమెరికా దళాలకు సారధ్యం వహించారు లాయిడ్.అయితే బిడెన్ తన క్యాబినెట్ లో మైనారిటీలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనుకోవడం కూడా లాయిడ్ కు కలిసి వచ్చింది.అంతేకాదు లాయిడ్ కు ఒబామా కు దాదాపు 7 ఏళ్ళకు పైగా మంచి స్నేహం ఉందని ఆ అంశం కూడా లాయిడ్ కు కలిసి వచ్చిందని అంటున్నారు నిపుణులు.2016 లో పదవీ విరమణ చేసిన లాయిడ్ ను బిడెన్ మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటే ఈ ఎన్నికకు సెనేట్ ఆమోదం తప్పనిసరిగా పొందాలి.అయితే బిడెన్ మాత్రం లాయిడ్ కు రక్షణ శాఖా మంత్రిగా పదవి ఇవ్వడానికి సిద్దమయ్యారని , త్వరలో అధికారికంగా బిడెన్ ప్రకటించనున్నారని తెలుస్తోంది.
.