దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతుంది.కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు సైతం కొత్త ఉద్యోగ నియామకాలను చేపట్టడం లేదు.
యువతలో చాలామంది పని తక్కువగా, జీతం ఎక్కువగా ఉండే ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు.అలాంటి ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లకు నిస్సిన్ సంస్థకు చెందిన టాప్ రామెన్ నూడిల్స్ శుభవార్త చెప్పింది.ఈ సంస్థ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నూడిల్స్ రుచి ఎలా ఉందో చెప్పే చీఫ్ నూడిల్ ఆఫిసర్ పోస్ట్ ను ప్రకటించింది.ఈ ఉద్యోగంలో చేరడానికి పెద్దగా చదువు కూడా అవసరం లేదు.
రుచి చూసి ఎలా ఉందో చెప్పే ఈ ఉద్యోగానికి ఏకంగా కంపెనీ 10,000 డాలర్లు ఆఫర్ చేస్తోంది.టేస్ట్ బడ్స్ జాబ్స్ అని పిలిచే ఈ ఉద్యోగాలు కాఫీ, టీ తయారు చేసే పరిశ్రమల్లో ఎక్కువగా ఉంటాయి.అయితే వేతనాలు మాత్రం సాధారణ ఉద్యోగుల వేతనాలలానే ఉంటాయి.అయితే టాప్ రామెన్ కంపెనీ మాత్రం ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఇండియన్ కరెన్సీ ప్రకారం నెలకు 7,30,000 రూపాయలు చెల్లిస్తూ ఉండటం గమనార్హం.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే టాప్ రామెన్ కంపెనీ నూడిల్స్ ను సింపుల్ గా, వెరైటీగా వండి ఆ వీడియోను సోషల్ మీడియాలో #HowDoYouTopRamen హ్యాష్ ట్యాగ్ కు జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.
ఆ పోస్ట్ లో ఖచ్చితంగా @OriginalTopRamen, @ChefMelissaKing అనే వాటికి పోస్ట్ ను ట్యాగ్ చేయాలి.
ఆ తర్వాత తాము ఆ ఉద్యోగానికి ఎందుకు అర్హులో పేర్కొంటూ కంపెనీకి ఈ మెయిల్ చేయాలి.వీడియో, మెయిల్ ద్వారా ఎవరైతే మెప్పిస్తారో వాళ్లు ఉద్యోగానికి ఎంపికవుతారు.
ఉద్యోగానికి ఎంపికైన వారికి 10,000 డాలర్ల జీతంతో పాటు కంపెనీ 50 సంవత్సరాల పాటు ఫ్రీగా టాప్ రామెన్ నూడిల్స్ ఇంటికి పంపుతుంది.ఈ సంస్థ ప్రకటనకు స్పందించి వేల సంఖ్యలో నిరుద్యోగులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.