సోమవారం శివునికి ఎంతో అత్యంత ప్రీతికరమైన రోజు.అంతే కాకుండా సోమవారం వారంలో రెండవ రోజు కావడంతో చంద్రుని వారం అని కూడా పిలుస్తారు.
చంద్ర గ్రహణం భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహం.అంతే కాకుండా భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం కూడా చంద్ర గ్రహం.
అయితే సోమవారం పుట్టిన వారు ఇలాంటి స్వభావం , మనస్తత్వం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
సోమవారంలో రెండవ రోజు కనుక, ఆ రోజు పుట్టిన వారి అదృష్ట సంఖ్య కూడా రెండుగా భావిస్తారు.
సోమవారం జన్మించిన వారి మనస్సు చంద్రుని తో పోలుస్తారు.చంద్రుడు హెచ్చు తగ్గులతో మనకు కనిపిస్తాడు కనుక ఆ రోజు జన్మించిన వారి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది.
సోమవారం శివునికి ముఖ్యమైన రోజు కనుక ఆ రోజు జన్మించిన వారు శివుని ఆరాధించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
సోమవారం జన్మించిన వారు ఎవరైనా కుటుంబ వ్యవహారాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తారు.
అంతే కాకుండా వీరు వ్యక్తిగత భావాలకు, అనుభవాలకు ఎక్కువ విలువ ఇస్తారు.సోమవారం రోజు పుట్టిన అమ్మాయి అయితే తమ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతారు.
అదే అబ్బాయిలు సోమవారం పుడితే వారికి తల్లి, భార్య, కుమార్తె లకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి వారిని ప్రేమగా చూసుకుంటారు.సమాజంలో కుటుంబ బాధ్యతలు కలిగిన వ్యక్తిగా పేరు ప్రతిష్టలు పొందుతారు.
ఈ రోజు జన్మించిన వారి వృత్తి వ్యాపారాలలో అందరి కంటే పై స్థానంలో ఉండాలనే తపనతో దాని కోసం నిరంతరం కృషి చేస్తూ అందరి మన్ననలను పొందుతారు.వ్యాపారం చేస్తున్నవారు ఈ రంగంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తారు.
సోమవారం జన్మించిన వ్యక్తుల స్వభావం చాలా సున్నితంగా ఉంటుంది.వీరు ఎక్కువగా తమ భాగస్వాములను ప్రేమగా చూసుకుంటూ ఎక్కువ సమయం వారితో గడపడానికి ఇష్టపడతారు.
సోమవారం జన్మించిన వారి కంటే ఎక్కువ కుటుంబ బాధ్యతలు ఉన్న వారిని కనుగొనటం చాలా కష్టం.సోమవారం జన్మించిన వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు శివుడిని లేదా గణపతిని పూజించే పనులు ప్రారంభించడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.