నీవేమైన స్టార్‌ అనుకుంటున్నావా కామెంట్‌ కు నందు కౌంటర్‌

సవారి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్‌ గా కూడా సక్సెస్‌ ను దక్కించుకున్న హీరో నందు.గీతా మాధురి భర్తగా బాగా పేరు బడ్డా కూడా నందు తనకంటూ ప్రత్యేక స్థానంను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

 Netizen Counter Attack To Nandhu,  Bomma Block Boster, Nandhu Netizens Trolls, B-TeluguStop.com

విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకుని పాత్రకు ప్రాణం పోసేందుకు తీవ్రంగా కష్టపడుతున్న నందు ప్రస్తుతం బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ అనే సినిమాను చేస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమాను ప్రకటించి నందు అందరి దృష్టిని ఆకర్షించాడు.

బిగ్‌బాస్‌ టైం నడుస్తున్న ఈ సమయంలో బిబి అంటూ ప్రచారం చేయడం ద్వారా తన సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కించుకున్న నందు సోషల్‌ మీడియాలో నెగటివ్‌ ట్రోలింగ్స్‌ ను ఎదుర్కొంటూనే ఉంటాడు.వ్యక్తిగతంగా సినిమాల పరంగా నందు చాలా ట్రోల్స్‌ ఎదుర్కొన్నాడు.

ఇప్పుడు మరోసారి నందు బిబి అంటూ ప్రచారం చేసినందుకు గాను టార్గెట్‌ అయ్యాడు.ఇక తాజాగా ఒక నెటిజన్‌ చేసిన కామెంట్‌ కు నందు బాగా హర్ట్‌ అయినట్లుగా అనిపించింది.

అతడికి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చాడు.

Telugu Bb Publicity, Geethamadhuri, Nandhunetizens-

బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ నుండి రేపు మీకోసం ఒక సర్‌ ప్రైజ్‌ అంటూ నందు పోస్ట్‌ చేశాడు.ఆ పోస్ట్‌కు ఒక వ్యక్తి స్పందిస్తూ.నువ్వు ఏమైనా స్టార్‌ హీరోవి అనుకుంటున్నావా.

సస్పెన్స్‌ లో పెట్టడానికి, వెంటనే విడుదల చేయ్యి బ్రో.చూసి చస్తాం, ఏదో పెద్ద స్టార్‌ అన్నట్లు పోస్ట్‌ బొక్క.

దీప్‌ అనే అతడి కామెంట్‌ కు నందు స్పందించాడు.మళ్లీ నీలాంటి వాడే వచ్చి నెపొటిజం.

తొక్క, కొత్త వారికి సపోర్ట్‌ చేయడం లేదు అంటూ మాటలు చెబుతారు.సూసైడ్‌ చేసుకుంటే తప్ప బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వాడికి సపోర్ట్‌ చేయని మీలాంటి సూడో బ్యాచ్‌ కు దండం.

అయినా నేను స్టార్‌ ను అని చెప్పుకోలేదు.నువ్వే ఇండైరెక్ట్‌ గా తగిలిస్తున్నావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube